
డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దుందుడుకుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన చేపడుతున్న చర్యలు దేనికవి వేర్వేరుగానే కనిపిస్తాయి. కానీ వాటన్నిటినీ కలిపి చూసినట్లయితే ఆయన బుర్రలో చాలా పెద్ద ఆలోచన ఏదో ఉన్నట్లు అర్ధమవుతుంది.
ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ‘అమెరికా ఫస్ట్’ అని ట్రంప్ నినాదం గుర్తుచేసుకోవలసి ఉంటుంది. ప్రపంచ దేశాలలో అమెరికా, అమెరికాలో ప్రజలు తన ప్రాధాన్యత అని అప్పుడే చెప్పారు. చెప్పినట్లుగానే చేస్తున్నారు కదా?
‘అమెరికా ఫస్ట్’ని మరింత విస్తృత దృష్టితో చూసినట్లయితే భారత్, చైనా, రష్యా మూడు దేశాలను పూర్తిగా కట్టడి చేసి, ప్రపంచదేశాలపై అమెరికా ఆధిపత్యం నెలకొల్పాలని ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఉక్రెయిన్‌పై సానుభూతి చూపుతున్నట్లు రష్యాని, దానిని నియంత్రించే పేరుతో భారత్‌ని తన అదుపులో ఉంచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. భారత్ నన్ను సంతోషపెట్టలేకపోతోందని ఇటీవల చెప్పిన ట్రంప్, 500 శాతం పన్నులు విధించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వెనిజులా నుంచి రష్యా జెండాతో వెళుతున్న ఓ చమురు నౌకను బ్రిటన్, అమెరికన్ దళాలు అడ్డుకొని అదుపులోకి తీసుకోవడం కూడా ట్రంప్ అమెరికా ఫస్ట్ ప్లాన్‌లో భాగంగానే చూడవచ్చు. దానిని రష్యా తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలాలలో అమెరికా దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు రష్యా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు పంపిస్తున్నామని ప్రకటించింది.
వెనిజులాలో చైనాకు చెందిన చమురు కంపెనీలున్నాయి. ఇప్పుడు వెనిజులా అమెరికా అధీనంలోకి రావడంతో అవి మూతపడే అవకాశం ఉంది. వెనిజులాని తన అధీనంలోకి తీసుకొని చైనాకి చమురు సరఫరా అడ్డుకొని కట్టడి చేయాలని ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. కనుక చైనా కూడా అమెరికాపై గుర్రుగానే ఉంది.
అమెరికాకు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న డెన్మార్క్, కొలంబియా, మెక్సికో దేశాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఈవిధంగా ఏదో ఓ కుంటి సాకుతో చుట్టుపక్కల చిన్నచిన్న దేశాలన్నిటిపై ఆధిపత్యం సాధించి వాటిని వలస దేశాలుగా మార్చేస్తూ, పరోక్షంగా అమెరికాని భౌగోళికంగా విస్తరించే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లున్నారు.
గతంలో పలువురు నియంతలు ప్రపంచాన్ని జయించి గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించారు. ట్రంప్ కూడా వారి బాటలోనే సాగుతున్నట్లున్నారు.
ఇలాంటి చర్యలతో ట్రంప్ ప్రపంచాధిపత్యం సాధించాలని భావిస్తున్నట్లున్నారు. కానీ వీటి కారణంగానే ప్రపంచ దేశాలకు అమెరికా ఉమ్మడి శత్రువుగా, ఏకాకిగా మారుతుందని ట్రంప్ గ్రహించడం లేదు. ఒకవేళ గ్రహించినా డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…