
2006లో కాలిఫోర్నియాలోని లేక్ తాహోయిలో గోల్ఫ్ టోర్నమెంటులో ట్రంప్ పరిచయమయ్యారని జెస్సికా డ్రేక్ అనే అడల్ట్ చిత్రాల నటి పేర్కొంది. తనను గోల్ఫ్ కోర్టులో నడకకు ట్రంప్ ఆహ్వానించడంతో మరో ఇద్దరితో కలిసి వెళ్లానని, ఆ తర్వాత తమ అనుమతి లేకుండా ఆయన తనను బలంగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నారని వివరించింది. రూముకు చేరుకున్నాక ట్రంప్ తమను పార్టీకి ఆహ్వానిస్తూ ఫోన్ చేశారని పేర్కొంది.
‘నీకెంత కావాలి?’ అని ప్రశ్నించారని, తన గదికి వస్తే 10వేల డాలర్లు ఇవ్వడంతో పాటు ఇంటికెళ్లేందుకు తన ప్రైవేటు విమానాన్ని వాడుకోవచ్చని ట్రంప్ ఆఫర్ ఇచ్చారని డ్రేక్ వివరించింది. ఈ సందర్భంగా ట్రంప్ తో కలిసి ఉన్న ఫోటోను విడుదల చేసింది. డ్రేక్ ఆరోపణలను ట్రంప్ క్యాంపెయిన్ కొట్టిపారేసింది. అదంతా కట్టుకథ అని, అసలు ఆమెవరో కూడా ట్రంప్ కు తెలియదని ఓ ప్రకటనలో పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…