
భారత్‌పై 50 సుంకాలు విధించినా లొంగకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహం దెబ్బ తిందని ఆయన మాటలతోనే తెలుస్తోంది. కనుక మరోసారి అక్కసు వెళ్ళగక్కుతూ భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే బ్రాండెడ్ ఔషదాలు, పేటెంట్ హక్కులున్న ఔషదాలపై 100 శాతం సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో వీటిని 150-250 శాతం వరకు పెంచుతామని కూడా ముందే హెచ్చరించారు.
భారత్ ఏటా అమెరికాకు సుమారు 3.6 బిలియన్ డాలర్ల ఔషదాలు ఎగుమతి చేస్తుంటుంది. వీటిపై ట్రంప్ 100 శాతం సుంకాలు విధిస్తే వాటి ఎగుమతులు నిలిచిపోతాయి లేదా ఆ మేరకు పెరిగిన ధరల భారం అమెరికా ప్రజలే భరించాల్సి ఉంటుంది. రెంటిలో ఏది జరిగినా కష్టమే.
కరోనా సమయంలో డోనాల్డ్ ట్రంప్ భారత్‌ని బెదిరించి మరీ ‘డోలా’ టాబ్లెట్స్ రప్పించుకున్నారు. అదే సమయంలో భారత్ స్వయంగా కరోనా వ్యాక్సిన్ తయారుచేసుకోవడమే కాక అనేక దేశాలకు సరఫరా చేసి ఆదుకుంది!
దీనిని బట్టి సాధారణ ఔషదాల కోసం కూడా అమెరికా భారత్‌పై ఎంతగా ఆధారపడి ఉందో, ఔషద తయారీ రంగంలో అమెరికా కంటే భారత్ ఎంత ముందుందో అర్ధం చేసుకోవచ్చు.
నేటికీ అమెరికా ఒక్క భారత్ నుంచే ఏడాదికి 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఔషదాలు దిగుమతి చేసుకుంటోందంటే అమెరికా ఔషద రంగం పరిస్థితి మారలేదని స్పష్టమవుతోంది.
ఒక్క ఔషద రంగంలోనే కాదు… ప్రత్యక్షంగా మరియు ఆన్‌లైన్ వైద్య సేవలు, ఆరోగ్య భీమా సేవలకు భారత్ వంటి దేశాలపై చాలా ఆధారపడి ఉంది.
ట్రంప్ నిర్ణయం కారణంగా విదేశాల నుంచి ఔషదాలు దిగుమతులు, వైద్య, భీమా తదితర సేవలు నిలిచిపోతే తీవ్ర ఇబ్బందులు పడేది అమెరికా ప్రజలే. కనుక భారత్ లేదా ఇతర దేశాలను దెబ్బతీయలనే ప్రయత్నంలో కూర్చొన్న కొమ్మని నరుక్కుంటున్నారని చెప్పక తప్పదు.
ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు అపారమైన నష్టం తప్పదు. కానీ ట్రంప్ ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా దాహం వేసినప్పుడు నుయ్యి తవ్వడం మొదలుపెడుతున్నారు అంతే!
Ranabaali marks the second collaboration between director Rahul Sankrityan and Vijay Deverakonda. Set against a…
It has been more than a couple of years since the formation of the NDA…