
అమెరికా అధ్యక్షుడు అంటే యావత్ ప్రపంచదేశాలకు ఎంతో గౌరవం. ఇది ఒకప్పటి మాట!
ఇప్పుడు ప్రపంచదేశాల దృష్టిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటే ఓ రాజకీయ బఫూన్… ఎప్పుడు ఏం మాట్లాడుతారో… ఏం చేస్తారో తెలీని అయోమయ చక్రవర్తి! ఎప్పుడు ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తారో ఎవరిని అవమానిస్తారో తెలీని అహంభావి.
డోనాల్డ్ ట్రంప్ కూడా ప్రపంచ దేశాల దృష్టిలో తనపై ఉన్న ఈ అభిప్రాయాలు మారకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. తాను ఏడు యుద్ధాలు ఆపిన గొప్ప మానవతావాదినని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదే ఊపులో రష్యా-ఉక్రెయిన్ దేశాల మద్య యుద్ధానికి బ్రేకులు వేస్తానంటూ వాటి మద్య వేలుపెట్టారు. కానీ ఇప్పుడు పుతిన్, జెలెన్ స్కీ ఇద్దరికీ నచ్చజెప్పలేకపోతున్నానని చెప్పి నవ్వుల పాలవుతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని ట్రంప్ అనుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ ప్రయత్నంలో భారత్‌పై ట్రంప్ కన్నెర్ర చేయడం ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చిన్నట్లుంది.
భారత్ వంటి మిత్రదేశాన్ని ఇబ్బంది పెట్టి దూరం చేసుకోవడం అమెరికాకు ఏమాత్రం మంచిది కాదని మాజీ అధ్యక్షురాలు కమలా హారిస్ అభిప్రాయపడ్డారు. కానీ ట్రంప్ పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. ఎవరి మాట వినరు!
కనుక భారత్‌లో ‘తన అజెండాని అమలుచేసేందుకు’ తనకు అత్యంత నమ్మకస్తుడైన సెర్గియో గోర్‌ని భారత్‌లో అమెరికా రాయబారిగా నియమించానని చెప్పారు. త్వరలోనే మళ్ళీ సుంకాలు పెంచుతానని హెచ్చరించారు. అంటే భారత్‌పై మరింత ఒత్తిడి తెచ్చి, మరిన్ని ఆంక్షలు విధించి దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న మాట!
భారత్‌పై అక్కసుతో ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్తాన్‌ని ట్రంప్ చంకనెక్కించుకుంటున్నారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యాని అడ్డుకునేందుకు అమెరికా ఇదేవిధంగా తాలిబన్లకు ఆయుధాలు అందించి, యుద్ధ శిక్షణ ఇచ్చి కోరలు, కొమ్ములు మొలిచేలా చేసింది!
ఆ తర్వాత అదే ఆఫ్ఘనిస్తాన్‌లో అదే తాలిబాన్లతో పోరాడుతూ వేలాదిమంది అమెరికన్ సైనికులే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ట్రంప్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్లు చెప్పవచ్చు. కనుక ఈ తప్పుకీ అమెరికా ఏదోనాడు మూల్యం చెల్లించుకోవలసి రావచ్చు.
అమెరికాలో పరిశ్రమలు, ఐటి కంపెనీలకు పునరుజ్జీవం కల్పించి అమెరికన్లకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం అధ్యక్షుడుగా ట్రంప్ భాద్యతే. కానీ ఇదంతా రాత్రికి రాత్రి చేసేయగలననుకోవడం, ఇందుకోసం యావత్ ప్రపంచ దేశాలతో శత్రుత్వం పెంచుకోవడం రెండూ సరికాదు.
కానీ ట్రంప్ ఎవరి మాట వినరు. కనుక తనంతట తానుగా ఈ ఆలోచనలు మార్చుకుంటే తప్ప ఎవరూ ఏమీ చేయలేరు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…