
వైసీపి ఏజంట్లకు కౌంటింగ్ శిక్షణా కార్యక్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పిన మాటలు విని వైసీపి సానుభూతిపరులే ఆయనని బహిరంగంగా అలా మాట్లాడొద్దని ఎవరైనా చెప్పండర్రా…. అంటూ మెసేజులు పెట్టుకుంటున్నారు.
“సజ్జల మాటలతో పార్టీ పరువు పోతోంది… చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర ఎన్నికల కమీషన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడంటూ ఆయనకు అంత ఎలివేషన్ ఈయడం దేనికి?ఈయన మాటలతో పార్టీ గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి… ఈసారి ఈయనే ఎన్నికల కమీషన్కి వైసీపిని పట్టిచ్చేలా ఉన్నాడంటూ…” సోషల్ మీడియాలో వైసీపి మద్దతుదారులు పెట్టుకుంటున్న మెసేజులు చూస్తే, సజ్జల రామకృష్ణా రెడ్డి వలన వైసీపికి ఓటమి కంటే ఎక్కువ నష్టం కలుగుతోందని అర్దమవుతోంది.
కౌంటింగ్లో ఏజంట్ల శిక్షణా కార్యక్రమంలో వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనకి రూల్స్ ఫాలో అయ్యేవారు ఏజంట్లుగా అవసరం లేదు. కౌంటింగ్ కేంద్రాలలో టిడిపి ఏజంట్లను ధాటిగా ఎదుర్కొని అడ్డుకోగలవారే కావాలి. మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామనే విషయాన్ని ప్రతీ వైసీపి కౌంటింగ్ ఏజంట్ బుర్రలోకి ఎక్కించుకొని ఆ నమ్మకంతోనే కౌంటింగ్ కేంద్రాలలో టిడిపి ఏజంట్లను గట్టిగా ఎదుర్కోవాలి. అంతా మనం అనుకున్నట్లు జరగాలి,” అని ప్రధాన ఏజంట్లకు సజ్జల రామకృష్ణా రెడ్డి హితభోధ చేసిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈసారి కౌంటింగ్ కేంద్రాలలో రసాభాస జరుగబోతోందని వైసీపి ఎమ్మెల్యే పేర్ని నాని ముందే చెప్పారు. సజ్జల రామకృష్ణా రెడ్డి తమ ఏజంట్లకు చేస్తున్న ఈ హితభోద కూడా అదే సూచిస్తోంది.
ఒకవేళ ఆయన ఇలాంటి మాటలు చెప్పాలనుకుంటే మీడియా లేనప్పుడు చెప్పుకోవాలి కానీ మీడియా సమక్షంలోనే ఈవిదంగా మాట్లాడి, రేపు కౌంటింగ్ కేంద్రాలలో గొడవలు జరిగితే దానికి వైసీపి ఏజంట్లే బాధ్యులు అని ఈసీతో సహా అందరూ అనుకునేలా చేశారని సోషల్ మీడియాలో వైసీపి మద్దతుదారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేపు వైసీపికి వ్యతిరేకంగా ఈసీ మరేదైనా నిర్ణయం లేదా కటిన చర్యలు తీసుకుంటే అప్పుడు వైసీపిలో ఎవరూ ఈసీని వేలెత్తి చూపలేని పరిస్థితి కల్పించారని సజ్జల రామకృష్ణా రెడ్డిపై వైసీపి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆవేదన, ఆగ్రహం సహేతుకంగానే ఉంది కదా?
అందుకే సజ్జల వైసీపికి, జగన్మోహన్ రెడ్డికి శల్యసారధ్యం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు కూడా.
There is a common misconception about movie collection figures. Fans often add GST to box-office…
Cinematographer Shamdat is making his Telugu directorial debut with the psychological thriller Don’t Sleep,…