మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు: ఇద్దరు చెల్లెమ్మలది ఒకటే మాట!

‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ పార్టీలో అందరి చేత చెప్పించగలిగారు. గత 58 నెలలుగా సంక్షేమ పధకాల పేరుతో ఓటర్లకు డబ్బులు పంచుతూ, అదే నేను చేసిన ‘మేలు’ అని నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు. వారి ఇళ్ళకు స్టిక్కర్స్ కూడా అంటింపజేశారు.

బటన్ నొక్కుడు సభలకు రాకపోతే కీడు తప్ప ‘మేలు’ జరగదని భయపెట్టి బలవంతంగా తీసుకువస్తున్నారు. వారి చేతుల్లో ‘థాంక్యూ సిఎం సార్’ ప్లకార్డులు పెట్టించి, ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అని చెప్పిస్తున్నారు. అయినా నమ్మకం కుదరక వందల కోట్లు ఖర్చు చేసి ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ రాష్ట్రమంతా పోస్టర్స్, వైసీపి జెండాలు పెట్టించుకున్నారు.

ADVERTISEMENT

రాష్ట్రంలో ఇంతమందిని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నా ఇద్దరు మాత్రం జగన్మోహన్‌ రెడ్డిని అసలు నమ్మడం లేదు. వారే జగన్మోహన్‌ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల, మరో చెల్లెలు సునీతా రెడ్డి.

తన అన్న అసమర్ధుడు, అవినీతిపరుడు, అరాచకవాది… ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని వైఎస్ షర్మిల ఊరూరూ తిరిగి చెపుతుండటం అందరూ వింటూనే ఉన్నారు.

ఇప్పుడు సునీతారెడ్డి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ “నా తండ్రిని హత్యలో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రికి ప్రమేయం ఉంది. అవినాష్ రెడ్డికి తప్పనిసరిగా శిక్ష పడాలి.

జగన్మోహన్‌ రెడ్డి పదేపదే విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటారు. మరి నా తండ్రి హంతకులకు శిక్ష పడేలా చేస్తానని నాకు మాట ఇచ్చి ఎందుకు తప్పారు? వాళ్ళిద్దరినీ జగన్మోహన్‌ రెడ్డి కాపాడుతున్నారు. ఎందుకు?

రాజకీయాలలో నీతి, నిజాయితీ ఉండాలి. కానీ హత్యలు ఉండకూడదు. దయచేసి నా అన్నకి, ఆయన వైసీపికి ఎవరూ ఓట్లు వేయవద్దు. వేస్తే ఆంధ్రప్రదేశ్‌ సర్వనాశనం అయిపోతుంది,” అని సునీతా రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వివేకా హత్య, నిందితులు, కేసు, దానిలో పరిణామాలు గురించి ఆమె ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవన్నీ అప్రస్తుతం. కానీ సొంత చెల్లెళ్లే ‘మా అన్నకి, వైసీపికి ఓట్లు వేయొద్దు,’ అని చెపుతున్నారు కదా?సొంత అన్న తమపైకి తన కాలాకేయ సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని ఇద్దరూ బహిరంగంగానే చెపుతున్నారు కదా?సొంత చెల్లెళ్లే మా అన్నపై మాకు నమ్మకం లేదని చెపుతుంటే మరి రాష్ట్ర ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని ఎందుకు అనుకోవాలి?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Mrunal Thakur Says No, But What Is She Waiting For?

Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…

18 minutes ago

Rohit Back as MI Cap? Truth Behind Big Rumours

Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…

48 minutes ago