
నిజానికి నాని నటిస్తున్న “నిన్ను కోరి” సినిమా విడుదల తేదీ జూన్ 23గా ప్రకటించిన సమయంలోనే “స్పైడర్” వాయిదా ఖరారైపోయింది. అయితే దానిని మరింతగా బలపరిచాడు బన్నీ. జూన్ 23వ తేదీగా ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో బన్నీ గెటప్ అభిమానులకు ‘ఐ’ ఫీస్ట్ లా ఉండడంతో, మరింత ఉత్సాహంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటివరకు ‘బ్రాహ్మణుడు’ గెటప్ లో మాత్రమే దర్శనమిచ్చిన బన్నీ, ఈ పోస్టర్ లో మరో డిఫరెంట్ అవతారంలో ‘స్టైలిష్ స్టార్’ అన్న పేరును సార్ధకత చేసుకునేలా కనపడుతున్నారు.
‘దువ్వాడ జగన్నాధమ్, నిన్ను కోరి’ సినిమాలు రిలీజ్ డేట్స్ ఖరారయ్యాయి గానీ, మరి అభిమానులను ఊరిస్తోన్న ‘స్పైడర్’ విడుదల ఎప్పుడు అనే సందేహం సర్వత్రా నెలకొంది. అయితే జూన్ 23వ తేదీ నుండి ఏకంగా ఆగష్టు 11వ తేదీకి ‘స్పైడర్’ వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ, అధికారికంగా చిత్ర యూనిట్ ఖరారు చేయాల్సి ఉంది. ఈ వాయిదాతో మరో విషయం కూడా స్పష్టమైంది. ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల అవుతుందని భావించిన కొరటాల శివ “భరత్ అనే నేను” 2018 షెడ్యూల్స్ లోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…