
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం వివాదాలలో, రాజకీయ జీవితం అయోమయంలో కొనసాగుతుంది. అయినా కూడా దువ్వాడ తాను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వారికీ మాత్రం దూరం కాలేకపోతున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మద్దతు చూసుకుని ప్రత్యర్థి పార్టీల మీద తెగ రెచ్చిపోయిన దువ్వాడ, వైసీపీ ఓటమితో వైసీపీ కండువా మార్చలేక, మరో పార్టీ కండువా కప్పుకునే అవకాశం రాక కొంతకాలం రాజకీయంగా సైలెంట్ అయ్యారు.
ఇదిలా ఉంటే ఇక భార్య దువ్వాడ వాణితో కుటుంబ విభేదాలు, వారి కుమర్తెలతో కుటుంబ కలహాలు, దివ్వెల మధురితో ప్రేమ వ్యవహారాలతో శ్రీను వ్యక్తిగత జీవితం మీడియాకెక్కింది. ఇక అక్కడి నుంచి శ్రీను, మాధురిల ప్రేమాయణం మొత్తం సోషల్ మీడియాను చుట్టూ ముట్టడంతో వైసీపీ క్యాడర్ నుంచి లీడర్ల వరకు శ్రీను మీద చర్యలకు అధిష్టానం పై ఒత్తిడి చేసారు.
అయితే ఎట్టకేలకు స్పందించిన వైసీపీ అధినేత దువ్వడాను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించారు. ఇక ఇక్కడి నుండి మొదలైన దువ్వాడ మెలోడ్రామా ఇప్పుడు హైద్రాబాద్ వరకు వ్యాపించింది. జగన్ పార్టీ నుండి బయటకు గెంటేయడంతో, ఏపీలో తంతే తెలంగాణలో పడ్డారా అన్నట్టుగా ఇప్పుడు శ్రీను, మాధురి ఇద్దరు హైద్రాబాద్ లో దర్శనమిచ్చారు.
హైద్రాబాద్ లో జరుగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఈ ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తూ మరోసారి సోషల్ మీడియాకు ఆహారమయ్యారు. ఇంత జరిగినా దువ్వాడ శ్రీను తానూ చేసిన తప్పేంటో, రాజకీయాలలో ఉండే నాయకులు పాటించాల్సిన కనీస విలువలేంటో అన్నది కూడా తెలుసుకోకపోవడం ఆయన అవివేకం అంటూ వైసీపీ శ్రేణులే దువ్వాడ చర్యలను వ్యతిరేకిస్తున్నారు.
అయితే కేవలం ఈ గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనడానికే దువ్వాడ ప్రేమ జంట హైద్రాబాద్ లో వాలిపోయారా.? లేక మరేఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది.
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…