
అందులేడు ఇందులేడనే సందేహం వలదు…. అన్నట్లు జగన్ పాలనలో ఏ రంగంలో అవినీతి జరిగింది?ఎవరెవరు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు? అంటే అన్ని రంగాలలో, అన్ని శాఖలలో, దాదాపు వైసీపిలో అందరూ అని చెప్పుకోవాలేమో?
అయితే అధికారంలో ఉన్నప్పుడు వైసీపి నేతలు భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటే అర్దం చేసుకోవచ్చు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా చేస్తున్నారంటే వారి ధైర్యానికి మెచ్చుకోవలసిందే కదా? ఆ ఘనుడు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత రెండు రోజులుగా కాకినాడ పోర్టులో తనికీలు నిర్వహిస్తున్నారు. ఈ తనికీలలో కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్దంగా ఉంచిన సుమారు 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియాన్ని గుర్తించి వెంటనే సీజ్ చేయించారు.
ఈరోజు మళ్ళీ తనికీలు చేయగా అశోక యాంకరింగ్ పోర్టులో 2,800 మెట్రిక్ టన్నులు, హెచ్1 పోర్టులో మరో 2,500 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 5,300 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాని సీజ్ చేయించారు.
అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ, “ద్వారంపూడి కుటుంబం గత 5 ఏళ్ళుగా కాకినాడ పోర్టుని పూర్తిగా కబ్జా చేసి రేషన్ దుకాణాలలో పేద ప్రజలకు అందాల్సిన బియాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తోందని మీడియాలో వార్తలు వస్తుండేవి. వాటి గురించి నేను వినడమే తప్ప ఎన్నడూ చూడలేదు.
ఇప్పుడు తొలిసారిగా కాకినాడ పోర్టులో తనికీలు నిర్వహిస్తే ద్వారంపూడి కుటుంబం అక్రమాలు బయటపడ్డాయి. గత 5 ఏళ్ళుగా ఈ దోపిడీ సాగుతూనే ఉంది. ఇప్పటికీ ద్వారంపూడి కుటుంబం ఏమాత్రం సంకోచించకుండా రేషన్ బియాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తుండటం చూసి నేను ఆశ్చర్యపోయాను.
తక్షణమే కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులన్నీ నిలిపివేయాలని పోర్టు మేనేజర్ని కోరాను. దీనిపై విచారణ జరిపించి ఎంత దోపిడీ జరిగిందో కనుగొని తగు చర్యలు తీసుకుంటాము,” అని చెప్పారు.
ప్రభుత్వం మారినా నేటికీ పౌరసరఫరాల శాఖ లేదా రేషన్ షాపుల నుంచి ద్వారంపూడి ఇన్ని వేల టన్నులు బియ్యం తీసుకువెళ్ళగలుగుతున్నారంటే అది ఖచ్చితంగా ఇంటి దొంగల పనే. కనుక ముందుగా వారిని పట్టుకోవలసి ఉంటుంది.
కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే, రాష్ట్రంలో మిగతా పోర్టులలో వైసీపి నేతలు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చుంటారని అనుకోలేము. కనుక రాష్ట్రంలో అన్ని పోర్టులతో పాటు రోడ్డు మార్గంలో కూడా ఇటువంటి అక్రమ రవాణా జరుగుతోందా? జరుగుతుంటే ఎవరెవరు దాని వెనుకున్నారో కనుగొనవలసి ఉంది.
Director Rahul Sankrityan had some big words for Rashmika Mandanna at the Ranabaali pre-release event.…
Water is becoming a major political and economic challenge for southern India. Andhra Pradesh, Telangana,…