
ఇది ఒక్క భారత్‌కే పరిమితం కాలేదని, ప్రపంచమంతా ఈ సమస్య పేరుకుపోయి ఉందన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లకు తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఉంటుందని, కానీ టి-20 లాంటి వాటిలో ఆ అవకాశం ఉండదని పేర్కొన్నాడు. ఐపీఎల్, ఆస్ట్రేలియాలోని బిగ్‌బాష్ లాంటి వాటి వల్ల తక్కువ సమయంలోనే క్రికెటర్లకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. దీంతో మరింతగా రాటుదేలేందుకు వారు కష్టపడడం లేదని, శిక్షణను అక్కడితో ఆపేస్తున్నారని అన్నాడు.
చాలామంది యువ క్రికెటర్లు మంచి నైపుణ్యం సాధిస్తున్నారు. ఒకసారి బాగా సంపాదించే అవకాశం వచ్చాక వారు కష్టపడడాన్ని ఆపేస్తున్నారు అని మెక్‌గ్రాత్ వివరించాడు. క్రికెటర్లు బాగా సంపాదించడం చాలా మంచి విషయమని, అయితే డబ్బు అనేది ఆట తర్వాతే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని క్రికెటర్లకు సూచించాడు. క్రికెటర్ల లక్ష్యం దేశానికి ప్రాతినిధ్యం వహించడంపైనే ఉండాలి తప్ప డబ్బుపై కాదని యువ క్రికెటర్లకు పిలుపునిచ్చాడు.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…