
తెలంగాణ బీజేపీ రాజకీయం ఇప్పటికి ఆ పార్టీ క్యాడర్ కి కూడా అర్ధం కాని రీతిలో ముందుకెళుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. ఎవరికీ వారే యమునా తీరే అనే సామెతకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది టి. బీజేపీ.
టి. బీజేపీ లో నాయకత్వం కంటే కూడా నాయకులే ఎక్కువ అన్న చర్చ నడుస్తుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచందర్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డా. కె. లక్ష్మణ్, ఈటెల రాజేంద్ర ప్రసాద్…ఇలా తెలంగాణ బీజేపీ కి నాయకుల కొరత లేదు.
కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తున్న నాయకుల నుంచి రాష్ట్ర రాజకీయంలో దశాబ్దాల అనుభవం ఉన్న నేతల వరకు చాలామంది బలమైన నాయకులు ఉన్నారు. అయితే వీరి ఈ బలం పార్టీ బలోపేతాని కన్నా కూడా వ్యక్తిగత ప్రతిష్ట కే వినియోగించడంతో టి. బీజేపీ ఇప్పటికి తెలంగాణ రాజకీయాలలో తన స్టానాన్ని, స్థాయిని మెరుగుపరుచు కోలేకపోయింది.
ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ మంత్రిగా బీజేపీ లో చేరిన ఈటెల టి.బీజేపీ బ్రాండ్ గా నిలవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలన్నీ పొందలేకపోయారు. అయితే మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను అక్కడి నుంచి తొలగించాలి అనే డిమాండ్ తో ఈటెల మొదలుపెట్టిన ‘మహా పాదయాత్ర’ ను సైతం పోలీసులు అడ్డుకోవడంతో ఈటెల ఈ ప్రయత్నం కూడా కార్యరూపం దాల్చలేకపోయింది.
ఘట్ కేసరి మండలం ఏదులాబాద్ నుంచి నాలుగు రోజుల పాటు సాగే ఈ మహాపాదయాత్ర కోసం తానూ ముందుగానే అధికారుల అనుమతి కోరారని, అయినా కూడా పోలీసులు తన పాదయాత్రను అడ్డుకోవడం దారుణం అంటూ ఈటెల కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల పై మండిపడ్డారు.
టి.బీజేపీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఈటెల ను ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈటెల బీజేపీ లో తనకంటూ ఒక సొంత బ్రాండ్ సృష్టించుకోగలరా.?
Even after a complete sweep against his party in Pulivendula, YS Jagan Mohan Reddy is…
దేశంలో బీజేపీ కూటమి ఎన్డీయే గత మూడు దఫాలుగా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. అయితే ఇక భవిష్యత్…