
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో నేడు మరోకీలక ఘటన తెరమీదకొచ్చింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మికి నోటీసులు జారీ చేసారు.
ఈ నెల 27 న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యలయంలో విచారణకు హాజరుకావాలంటూ అధికారులు కేశినేని జానకి లక్ష్మి కి సమన్లు జారీచేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఇప్పటికి వైసీపీ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు, జగన్ సన్నిహితులు అరెస్టయ్యి జైల్లో ఉన్నారు, మరికొందరు బైళ్ళ బయట తిరుగుతున్నారు.
లిక్కర్ స్కాం కేసులో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి తో జానకి లక్ష్మికి వ్యాపార సంబంధాలు ఉండడం, అలాగే ‘ప్రైడ్ ఇన్ ఫ్రాకాన్’ ఎల్ఎల్పి కంపెనీతో సాగిన అనుమానిత ఆర్థిక లావాదేవీల మీద ఈడీ అధికారులు ఆరా తీయడంతో కేశినేని జానకి పేరు వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ కేసు విచారణ కోసం గతంలోనే జానకి లక్ష్మికి అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ నేడు మరోసారి ఆమె పేరు తెరమీదకు రావడం, ఆమెకు విచారణకు హాజరుకాలంటూ సమన్లు జారీ చేయడం అధికార టీడీపీ పార్టీకి ఊహించని రాజకీయ షాక్ అనే చెప్పాలి.
లిక్కర్ స్కాం కేసులో వచ్చిన అక్రమ లాభాల్లో కేశినేని జానకి లక్ష్మి కి కూడా సంబంధం ఉండొచ్చనే అనుమానాలతో ఈడీ అధికారులు జానకి కి నోటసులు ఇచ్చినట్టు సమాచారం. కూటమి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న లిక్కర్ స్కాం కేసులోనే అధికార పార్టీ ఎంపీ భార్య పేరు రావడం ఇది అటు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తో పాటుగా టీడీపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఊహించని రాజకీయ ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
ప్రభుత్వ చిత్తసుద్దికి ఇదొక అగ్ని పరీక్ష వంటిది. అటు కేశినేని చిన్ని విషయంలో కూడా అవకాశం కోసం ఆయన సోదరుడు కేశినేని నాని కాసుకొని కూర్చున్నారు, అలాగే ఇటు సొంత పార్టీలో సైతం కేశినేని పై రాజకీయంగా పై చేయి కోసం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వేచి చూస్తున్నారు.
ఇక ప్రత్యర్థి వైసీపీ కూడా ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి టీడీపీ పార్టీ, కూటమి ప్రభుత్వం ఈ సమస్య నుండి ఎలా బయటపడుతుందో చూడాలి. ప్రజలను సమాధాన పరుస్తూ ప్రత్యర్థుల నోర్లు మూపించగలగాలి, అలాగే తమ పార్టీ నేతల నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలి, లేదా తప్పు తేలితే చర్యలు తీసుకోగలగాలి.
As Welcome To The Jungle gears up for its grand theatrical release, the spotlight is…
Social media has become a highly demanding and unforgiving space for actors and actresses over…