Telugu

ఈడీ చేతికి మద్యం కుంభకోణం… హ్యాపీ?

ఏపీ మద్యం కుంభకోణం కేసు ఈడీ చేతిలోకి వెళ్ళబోతోంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ వద్ద గల సమస్త సమాచారం ఇవ్వాలని కోరుతూ ఈడీ లేఖ వ్రాసింది. అలాగే ఈ కేసులో సీఐడీ (సిట్) పేర్కొన్న నిందితులను, జైల్లో ఉన్న నిందితులను విచారించేందుకు అనుమతి కోరింది.

సిట్ ఛార్జ్-షీట్‌లో పలువురు నిందితులను పేర్కొని అందరూ కలిసి మద్యం ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు, వసూళ్ళ ప్రక్రియలో వేలకోట్లు అవినీతికి పాల్పడ్డారని, కమీషన్ల రూపంలో వచ్చిన ఆ సొమ్ముణి సూట్ కేసు కంపెనీలలోకి మళ్ళించి, ఎవరికీ అనుమానం కలుగకుండా వాటి నుంచి ఆ సొమ్ముని అంచెలంచెలుగా తాడేపల్లి ప్యాలస్‌కు చేర్చారని సిట్ ఆరోపిస్తోంది.

ADVERTISEMENT

ఈ కేసులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాధమిక ఆధారాలున్నాయి కనుక, తమని విచారణకు అనుమతించి, సంబంధిత నివేదికలు, డాక్యుమెంట్లు, ఆర్ధిక లావాదేవీలకు సంబందించిన పత్రాలు తమకు అందించాలని ఈడీ కోరింది.

ఈ కేసులో ఉన్నవారందరూ దాదాపు వైసీపీకి చెందినవారే. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. కనుక వారిపై మద్యం కుంభకోణంలో కేసులు నమోదు చేస్తే రాజకీయ కక్ష సాధింపులని కూటమి ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు.

కనుక ఈ కేసుని ఈడీకి అప్పగించాలనుకుంటున్నామని ఇది వరకే సిఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో చెప్పారు. బహుశః అందువల్లే ఈడీ ముందుకు వచ్చి ఉంటుంది.

కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఈ కేసు కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే ఈడీ చేతిలోకి వెళితే టీడీపీ, వైసీపీలకు లాభామా నష్టమా?అని ఆలోచిస్తే రెంటికీ లాభమే అని చెప్పవచ్చు.

అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులతోనే 5-12 ఏళ్ళుగా ఫుట్‌బాల్ ఆడేసుకొంటున్న వైసీపీ నేతలకి ఈ కేసుతో ఆడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇంత పరపతి, ఇంత శక్తివంతమైన వైసీపీ నేతలున్న ఈ కేసుని ఏపీ సీఐడీ స్థాయిలో పరిష్కరించడం చాలా కష్టమే. ఈ కేసులో దోషులకు శిక్షలు పడేలా చేయడం చాలా కష్టమే. కానీ వారు ప్రయత్నించక తప్పదు. ప్రయత్నిస్తున్న కొద్దీ వైసీపీ చేసే విమర్శలు, ఎదురుదాడితో టీడీపీకి రాజకీయంగా ఎంతోకొంత నష్టం జరుగుతుంది.

కనుక ఈడీ చేతికి ఈ కేసుని అప్పగించేస్తే ఇక వైసీపీ నేతలు సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని నిందించలేరు. నిందిస్తూ రాజకీయ మైలేజ్ పొందలేరు.

ఇక వైసీపీ విషయానికి వస్తే, ఈ కేసు సీఐడీ చేతులలో ఉండటం కంటే ఈడీ చేతిలోకి వెళ్ళడం వలన వారికి అరెస్టుల భయం ఉండదు. ఈడీని ఎలా హ్యాండిల్ చేయాలో వైసీపీ నేతలకు బాగా తెలుసు. కనుక ఈ మద్యం కుంభకోణం కేసు ఈడీ చేతిలోకి వెళిపోతే, ఈ కేసుని కూడా ఓ 5-10 ఏళ్ళు లాగించేస్తూ వైసీపీలో నిందితులు హాయిగా రిలాక్స్ అవవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

20 minutes ago

GV Prakash’s Big Bollywood Test

GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…

50 minutes ago