
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు సలహాదారులలో సజ్జల రామకృష్ణా రెడ్డి వేరు. ఆయనను జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా నియమించుకున్నారు కనుక ఆయనకే సలహాలు ఇవ్వాలి. ఇస్తున్నారో లేదో తెలీదు కానీ తరచూ సొంత మీడియాతో ప్రెస్‌మీట్‌లు పెట్టుకొని ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు.
ప్రభుత్వం నుంచి జీతం తీసుకొంటూ ప్రభుత్వానికి సలహా ఇవ్వకుండా వైసీపి తరపున వఖల్తా తీసుకొని తమపై విరుచుకు పడుతుండటంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశాయి. వారి ఫిర్యాదు సహేతుకంగానే ఉంది కనుక ఇకపై మీడియా సమావేశాలు పెట్టి రాజకీయాలు మాట్లాడితే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించింది.
దీంతో సజ్జల రామకృష్ణా రెడ్డి సలహాదారుగా కొనసాగాలా లేక ఆ పదవికి రాజీనామా చేసి వైసీపి కండువా కప్పుకొని రాజకీయాలు చేయాలో నిర్ణయించుకోవలసి వచ్చింది.
వైసీపి పుణ్యకాలం ఎలాగూ మరో నెల రోజుల్లో ముగిసిపోబోతోంది. కనుక ఆఖరి నిమిషంలో కండువా కప్పుకోవడం కంటే సలహాదారు హోదాలో అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో చక్రం తిప్పుకోవడమే మంచిదని ఫిక్స్ అయిన్నట్లు తెలుస్తోంది. కనుక ఇక నుంచి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రవచనాలు, వితండ వాదనలు వినే యోగం రాష్ట్ర ప్రజలకు లేకుండా పోయింది. ఈసీ ఆదేశాలు ఇంకా పోసాని చెవిలో పడిన్నట్లు లేవు. అందుకే ఆయన చొక్కా సవరించుకొంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటూ ఏదేదో మాట్లాడేస్తున్నారు.
వైసీపి కనుసన్నలలో పనిచేసే సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామి రెడ్డిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది. ఆయన ప్రభుత్వం నుంచి జీతం తీసుకొంటూ వైసీపి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఈసీ ఆయనపై వేటు వేసింది. అంతేకాదు అమరావతి దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదని ఈసీ ఆదేశించింది.
ఇప్పటికే వాలంటీర్లను, మునిసిపల్, పంచాయితీరాజ్ తదితర శాఖలలో పని చేసే కాంట్రాక్ట్, అవుట్ సౌర్సింగ్ ఉద్యోగులను ఈ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఏపీ డిజిపి, సీఎస్, ఇంటలిజన్స్ తదితర శాఖల ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల కమీషన్‌కు నివేదిక ఇచ్చామని, వారిపై అదే నిర్ణయం తీసుకొంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈవిదంగా వైసీపి ఎంతో నమ్మకం పెట్టుకున్నవారందరినీ కేంద్ర ఎన్నికల కమీషన్ ఒకరొకరిగా ఎన్నికలకు దూరం చేస్తుంటే ఐదేళ్ళుగా చేసిన ఆలోచనలు, వ్యూహాలు వాటి కోసం చేసిన వందల కోట్ల ఖర్చు అన్నీ బూడిదలో పన్నీరే అయిపోయేలా ఉంది.
Faith, festivity, and the significance of the divine feminine come together in Amma Kadhili Vacche,…
Prabhas is known for his generous nature and lavish food spreads for his cast and…