ఎపిక్ ఓటీటీ రెస్పాన్స్: సీక్వెల్ కష్టమే

Epic OTT Response Raises Questions About Aditya Haasan's Sequel

ఎపిక్ థియేటర్లలో విడుదలైన రోజే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇండైరెక్ట్ గా సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అండ్ ఫీడ్ బ్యాక్ కి దర్శకుడు ఆదిత్య హాసనే బాధ్యుడు అని తేల్చి చెప్పేసిన నాగవంశీ. అదేరోజు మీడియాతో మాట్లాడుతూ ఓటీటీ రెస్పాన్స్ బట్టి సీక్వెల్ తీయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాం అని కామెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే నిన్నటి నుండి ఎపిక్ ఓటీటీ స్ట్రీమింగ్ నుంచి వస్తున్న రెస్పాన్సులు చూస్తుంటే.. ఆ సినిమాకి సీక్వెల్ రావడం కష్టమే అనిపిస్తోంది. క్యాస్టింగ్ ఛాయిస్ మొదలుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ లో దొర్లిన తప్పుల వరకు అన్నిటినీ వేలెత్తి చూపుతున్నారు.

ADVERTISEMENT

పోనీ సినిమాలోని ఎమోషన్ ని లేదా రిలేషన్ షిప్ ని డీల్ చేసిన విధానాన్నైనా మెచ్చుకుంటున్నారా అంటే అదీ లేదు. డైరెక్టర్ పర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో సినిమాని ఎండ్ చేయడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఎంత సెల్ఫిష్ లవ్ స్టోరీ అయినా రియాలిటీకి కాస్తయినా దగ్గరగా ఉండాలి కదా అని అంటున్నారు.

రిలేటబుల్ లవ్ స్టోరీ అని ప్రమోట్ చేసి.. రిలేటబిలిటీ లేకపోవడం, బ్రీజీ లవ్ స్టోరీ అని చెప్పడంతో.. ఇటీవల విడుదలైన బెత్లెహం కుడుంబ యూనిట్ తో పోల్చి.. ఇదేం కామెడీ అంటూ ఎద్దేవా చేయడం వంటివి గట్టిగానే కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.

థియేటర్లలో ఎలాగూ ఆడలేదు, కనీసం ఓటీటీలో అయినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని ఊహించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఆశలన్నీ నీరుగారాయి. సో, ఆదిత్య మరో మంచి, నిజమైన రిలేటబుల్ కంటెంట్ తో ఆడియన్స్ ని మెప్పించి తన సత్తా చాటుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది.

ADVERTISEMENT
Latest Stories