ఆ ఇద్దరి లక్ష్యం కేసీఆర్ ను కారు దింపడమేనా?

ఈ సారి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు నల్లేరు మీద నడక మాదిరి ఉండవని ఇప్పటికే పలు సర్వేల నివేదికలు వెల్లడించాయి. అంతే కాదు అధికార పార్టీని వీడుతున్న నేతల సంఖ్య కూడా రోజురోజుకి బలపడుతుండడంతో రాష్ట్రంలో పదేళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోవాలని ఆరాటపడుతుంది.

బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ కుటుంబ రాజకీయాల మీద ముందునుంచి దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కారుని ఢీ కొట్టాలని ఆశపడుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దెదింపడంతో పాటు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కూడా కారు దింపడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్దమైనట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో తానూ గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయబోతున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో గజ్వేల్ నుండి కేసీఆర్ పై తానూ పోటీకి సిద్ధమంటూ బీజేపీ నేత ఈటెల రాజేంద్ర ప్రసాద్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.కేసీఆర్ ప్రభుత్వం తన పై చేసిన రాజకీయ కక్ష సాధింపులకు సరైన సమాధానము చెప్పడానికే తానూ ఈ పోటీకి సిద్దమయ్యాను అంటూ ఈటెల తెలిపారు. ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ కలిగిన మాస్ నాయకుడిగా ఈటెలకు మంచి గుర్తింపే ఉంది.

గజ్వేల్ నుంచి ఈటెల రూపంలో కేసీఆర్ కు సమఉజ్జి దొరికినట్లయింది. ఇక్కడ ఎన్నికలలో ఇద్దరికీ పోటాపోటీ ఫలితాలే రానున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ పై పోటీకి తానూ కూడా సిద్ధం అంటూ రేవంత్ ప్రకటించడంతో కేసీఆర్ పోటీ చేసే రెండవ నియోజకవర్గమైన కామారెడ్డి నుండి కాంగ్రెస్ రేవంత్ ని సిద్ధంచేశారు. రేవంత్ రెడ్డి తన వాక్చాతుర్యంతో అటు యూత్ లోను ఘాటైన రాజకీయ విమర్శలు చేస్తూ ఇటు మాస్ లోను మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

అయితే రాష్ట్రంలో ఈ సారి జరిగే ఎన్నికలు అటు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాదు ఇటు కేసీఆర్ కూడా కత్తి మీద సాము లానే మారింది. రెండు నియోజకవర్గాలలో ఇద్దరు మాస్ లీడర్లతో కేసీఆర్ టఫ్ ఫైట్ నే ఎదుర్కోవాల్సివస్తుంది. గెలుపోటములను పక్కన పెడితే ముగ్గురు ఉద్దండుల మధ్య హోరాహోరీ పోటీ. నువ్వా నేనా! అనేలా ఈ రెండు ప్రాంతాలలో ఎన్నికల పోటీ నిజమైన “మల్టీస్టారర్ సినిమాను” తలపించేలా ఉంటుంది అనడంలో ఎటువంటి అనుమానం అవసరంలేదు.

అన్ని అనుకున్నట్టే జరిగితే, తెలంగాణాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న ప్రశ్న కన్నా ఈ నియోజకవర్గంలో గెలుపెవరిది అన్న ప్రశ్న మీదే అందరి ఆసక్తి ఉంటుంది. ఇదే జరిగితే ఇక బెట్టింగ్ బాబాయిలా సందడి మాములుగా ఉండదు మరి! అయితే ఈటెల, రేవంత్ పార్టీలు వేరైనా వీరిరువురి ఉమ్మడి లక్ష్యం మాత్రం కేసీఆర్ ను కారు దింపడమే అనేది సుస్పష్టమైంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Ranabaali Review: USA Premiere Report

Ranabaali is the second collaboration between Vijay Deverakonda and director Rahul Sankrityan. Stay tuned for…

51 minutes ago

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

4 hours ago