Etv Win.. ఇంక ఆపేస్తే బెటర్!

ETV Win Promotions for Papam Prathap Movie

రామోజీరావు గారు స్థాపించిన అగ్రేసర సంస్థ ఈటీవీ. ఈటీవీ ఇది మీ టీవీ అంటూ ఆయన ఇచ్చిన స్లోగన్ ను యావత్ తెలుగు ప్రజానీకం స్వాగతించింది, అక్కున చేర్చుకుంది. ఆ బ్రాండ్ వాల్యూని తక్కువ చేయకుండానే బాపినీడు ఆ సంస్థను నిర్వహిస్తున్నారు. సాయికృష్ణ & నితిన్ కూడా సంస్థ విలువలను ఎక్కడా తక్కువ చేయకుండా మంచి కంటెంట్ ను బిల్డ్ చేస్తూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ల పేర్లు తెలియని నటీనటులు, దర్శకనిర్మాతలు లేరంటే అతిశయోక్తి కాదు.

అంటువంటి టీమ్ ఎందుకని సినిమా రిలీజ్ టైమ్ వచ్చేసరికి ఒక విధమైన సెన్సేషనలైజేషన్ పబ్లిసిటీ చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. “రాజు వెడ్స్ రాంబాయి” టైంలో కొన్ని వందల ట్విట్టర్ & ఇన్స్టా పేజీలు “పిసుక్కుని చచ్చిపోతాడట” అంటూ పోస్టులు చేశాయి, పాపం హీరో ఎందుకు రెస్పాండ్ అయ్యి అది క్లైమాక్స్ కాదు అని క్లారిటీ కూడా ఇచ్చుకున్నాడు.

ADVERTISEMENT

ఇప్పుడు శుక్రవారం విడుదలవుతున్న “పాపం ప్రతాప్” విషయంలోనూ అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారు. పగలు మనిషి, రాత్రి మృగం అంటూ పొలోమని పోస్టులు వేయిస్తున్నారు. ఓ 10 లేదా 20 పేజీలు పోస్ట్ చేశాయి అంటే సరే ఏదో కంటెంట్ దొరికింది.. పోస్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు కానీ.. నిమిషాల గ్యాప్ లో 100 దాకా పేజీలు సేమ్ కంటెంట్ ని కాస్త అటు తిప్పి ఇటు తిప్పి పోస్ట్ చేయడం అనేది పెయిడ్ క్యాంపైన్ అని అర్థమైపోతుంది.

ఈటీవీ విన్ బ్రాండ్ కి ఉన్న వాల్యూకి, ఈ మీమ్ పబ్లిసిటీకి పొంతన కుదరడం లేదు. ఇది ఎంతవరకు అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది తెలియదు కానీ.. ఓ నిర్మాణ సంస్థగా ఈటీవీ విన్ కి ఉన్న విలువలని మాత్రం ప్రశ్నార్థకం చేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories