
ఎన్నికలలో గెలిస్తే ఏ పార్టీ అయినా మా పార్టీ, మా నాయకుడి శక్తిసామర్ధ్యాల వల్ల గెలిచామని లేదా ప్రజలు తమని మెచ్చి ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకుంటారు తప్ప ఈవీఎంలతో గెలిచామని ఎవరూ చెప్పుకోరు.
గెలిచినప్పుడు గుర్తుకురాని ఈవీఎంలు ఓడిపోయినప్పుడు మాత్రం తప్పక కనబడతాయి. వాటి వలననే ఓడిపోయామని జగన్ వంటి వారు చెప్పుకుంటారు.
తమ పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, విధానపరమైన లోపాల కారణంగా ఓడిపోయామని అంగీకరించడానికి అహం అడ్డొస్తుంది.
కనుక ‘ఈసారి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించండి మా తడాఖా చూపిస్తామని’ చెపుతుంటారు. అమెరికా వంటి అగ్రదేశం నేటికీ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తోంది. కనుక మనం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం తప్పు అనే కొత్త సిద్దాంతం వల్లె వేస్తుంటారు.
ప్రపంచం ‘ఏఐ టెక్నాలజీ’తో దూసుకుపోతుంటే, మనం మళ్ళీ ఓ నాలుగైదు దశాబ్దాలు వెనక్కు వెళ్ళి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుపుకుందామని హితవు పలుకుతుంటారు.
జగన్‌కు ఇప్పుడు బ్యాలెట్ దోస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిన్న కేంద్ర ఎన్నికల కమీషనర్‌ని కలిసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలలో ఈవీఎంలతో జరిగిన ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పటికీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి కూడా ఈవీఎంలపై అనుమానాలు మొదలయ్యాయి.
2014 నుంచి… అంటే మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలపై తనకు చాలా అనుమానాలున్నాయన్నారు. బీజేపి తెర వెనుక కుట్రలు చేస్తూ ఎన్నికలలో గెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే తాము ఎంతగా గొంతు చించుకున్నప్పటికీ వచ్చే ఎన్నికలు కూడా ఈవీఎంలతోనే జరుగుతాయని వీరందరికీ బాగా తెలుసు.
ఈవీఎంలతో జరిగిన గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన వీరందరూ, ఈవీఎంలతోనే జరుగబోయే వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు.
మోడీ ప్రభుత్వం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయిస్తూ వరుసపెట్టి గెలుస్తోందని, అందువల్లే తాము ఓడిపోయామని గట్టిగా నమ్ముతున్న జగన్, కేటీఆర్, రాహుల్ గాంధీలు, మరి వచ్చే ఎన్నికలలో కూడా ప్రధానిగా మోడీయే ఉంటారు. అవే ఈవీఎంలు ఉంటాయి కదా? కనుక వారు ఆరోపిస్తున్నట్లు అప్పుడు కూడా ట్యాంపరింగ్ జరుగకుండా ఉంటుందా?మరి ఎలా గెలుస్తామనుకుంటున్నారు?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…