
సోషల్ మీడియా యాక్టీవిస్టుల పేరుతో వైసీపీ చేస్తున్న ఉన్మాదాన్ని ఉక్కు పాదంతో అణిచి వేయడానికి కూటమి ప్రభుత్వం వ్యవస్థలను బలపరిచింది. దీనితో సోషల్ మీడియాలో ఇటువంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న కరుడుగట్టిన వైసీపీ సోషల్ సైకోలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటున్న విషయం అందరికి విదితమే.
అయితే వీరి ఉన్మాదానికి పార్టీ నుండి పూర్తి మద్దతు ఉంటుందని, వారి పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అవసరమైన మేరకు న్యాయ సహాయం పార్టీ అందిస్తుంది అంటూ ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొదలు ఆ పార్టీలో ముఖ్యనేతలందరు నిస్సిగ్గుగా మీడియా ముఖంగా తప్పుకి కాపు కాస్తామంటూ ప్రకటనలు జారీ చేసారు.
ఇప్పుడు ఆ ప్రకటనలకు కట్టుబడే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల పెట్టినవారికి ఆశ్రయం కలిపిస్తూ సమాజంలో దోషిగా నిలబడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లి కి చెందిన ఈ వైసీపీ సోషల్ సైకో రాజశేఖర్ రెడ్డి గుంటూరు సిద్దార్ధ నగర్ లో ఉంటున్న మాజీ మంత్రి అంబటి ఇంట్లో ఆశ్రయం పొందుతూ పోలీసుల వేటకు చిక్కారు.
గత వైసీపీ ప్రభుత్వంలో సదరు రాజశేఖర్ రెడ్డి కూటమి నేతలను ఉద్దేశించి వారి పై అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆ పార్టీ నేతలను రెచ్చకొట్టే ప్రయత్నం చేసారు. దీనితో ఆయన మీద టీడీపీ నేతలు కేసు నమోదు చేయడంతో ఆయనను అరెస్టు చేయడానికి నూజివీడు పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టీవిస్టుల మీద అరెస్టు వారెంట్ ఉంటే వచ్చి అరెస్టు చేయాలి అంటూ నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కాను పోలీసు అధికారులు అరెస్టు వారెంట్ తో అంబటి రాంబాబు ఇంటికి చేరుకొని అక్కడ మాజీ మంత్రి గారి ఆశ్రయం పొందుతున్న రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా ఉంటూ సమాజం పై, మహిళల పై విషం చిమ్మే ఇటువంటి వ్యక్తులకు ఆశ్రయం కల్పిస్తూ అంబటి సభ్య సమాజానికి ఎం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇవేనా వైసీపీ పాటించే విలువలు, జగన్ చెప్పే విశ్వసనీయత.? చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దుర్మార్గపు పనులు అనేలా వైసీపీ నేతల వ్యవహార శైలి కనిపిస్తుంది.
అధినేత జగన్ మోహన్ రెడ్డేమో హత్యారోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డిని కాపాడుతూ, హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు కి అండగా ఉంటూ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుంటే, అంబటి, విడుదల రజని వంటి మాజీ మంత్రులేమో సోషల్ మీడియాలో ఉన్మాదుల మాదిరి రెచ్చిపోయిన సైకోలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.? అన్న సామెత వైసీపీ పార్టీ కి సరిగ్గా సరిపోతుందేమో.!
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…