విఐపీలు… థర్డ్ డిగ్రీ… అరెస్ట్… ప్రశ్నలు…!

Excise department sends notice Telugu actors drug racketబుధవారం నుండి ప్రారంభం కాబోతున్న సినీ సెలబ్రిటీల విచారణ అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. తొలి రోజు దర్శకుడు పూరీ జగన్నాధ్ హాజరు కావాల్సి ఉండగా, ఇంతవరకు పూరీ హాజరుపై స్పష్టత రాలేదు. ఉదయం 10.30 నిముషాలకు పూరీని హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు అందించారు. అయితే అదే సమయానికి కాకపోయినా సాయంత్రం అయిదు గంటల లోపు ఎప్పుడైనా హాజరు కావచ్చని తెలుస్తోంది. ఈ సందిగ్ధం ఇలా కొనసాగుతుండగానే, మరో న్యూస్ హల్చల్ చేస్తోంది.

ఒకవేళ పూరీ హాజరు కాని పక్షంలో తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? అన్న దానిపై అరెస్ట్ వారెంట్ జారీ కావచ్చన్న టాక్ సందడి చేస్తోంది. దీని గురించి అయితే స్పష్టత ఇవ్వలేదు గానీ, విచారణకు రాబోయే సెలబ్రిటీల గురించి ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ ఓ స్పష్టమైన సమాచారం ఇచ్చారు. డ్రగ్స్ కేసు విచారణకు హాజరయ్యే సినీ ప్రముఖులంతా విఐపీల క్రిందే ట్రీట్ చేస్తామని, వారి మీద థర్డ్ డిగ్రీ వంటివి ప్రయోగించబోమని, చాలా మర్యాద పూర్వకంగా చూస్తామని తెలిపారు.

ADVERTISEMENT

ఇంకా నమ్మకం లేని పక్షంలో వారంతా లాయర్లతో సహా హాజరయ్యే సౌకర్యాన్ని కల్పించామని, అవసరమైతే న్యాయవాదులను వెంట పెట్టుకుని విచారణకు హాజరు కావచ్చని, ఈ విచారణకు సంబంధించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అప్పటికప్పుడు అరెస్ట్ లు చేయమని స్పష్టత ఇచ్చారు. ఎక్సైజ్ కమిషనర్ చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ విచారణను ఎదుర్కొనే సినీ ప్రముఖులంతా వారంతా ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. ఇక ఈ విచారణకు ముమైత్ ఖాన్ కు మినహాయింపు లభించిందన్న టాక్ ఊపందుకుంది.

ఇదిలా ఉంటే… తొలి రోజు పూరీని సిట్ అధికారులు అడగనున్న ప్రశ్నలు మీడియా వర్గాలలో లీక్ అయ్యాయి. మొత్తం పది ప్రశ్నల చుట్టూనే ఈ విచారణ సాగనున్నట్లుగా కనపడుతోంది. ఈ ప్రశ్నలకు పూరీ నుండి సరైన సమాధానం లభిస్తే… ఈ కేసులో చిక్కుముడి వీడినట్లేనని అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రశ్నలేంటో తెలుసా…
1) కెల్విన్ మీకు ఎలా పరిచయం?

2) పార్టీలు బయట కాకుండా, ఇంట్లోనే ఎందుకు చేసుకుంటారు?

3) కెల్విన్, జిషన్ లు మీ ఇంటికి ఎందుకు వచ్చారు?

4) ఎన్ని రోజులుగా మీరు డ్రగ్స్ వినియోగిస్తున్నారు?

5) కొకైన్ కావాలంటూ కెల్విన్ దగ్గరికి ఎవరిని పంపారు?

6) నెలకు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటారు?

7) కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేసేవారు?

8) మీ ద్వారా ఛార్మి, ముమైత్ ఖాన్, రవితేజ, సుబ్బరాజులకు డ్రగ్స్ వెళ్ళింది… నిజమా? కాదా?

9) డ్రగ్స్ తీసుకున్న తర్వాత కొద్దిరోజుల పాటు హైదరాబాద్ లో ఎందుకు ఉండరు?

10) మీరు బ్లడ్ టెస్ట్ కు సిద్ధమా? మా దగ్గర ఉన్న ఫోటోలకు మీ సమాధానం ఏంటి?

ADVERTISEMENT
Latest Stories