ఎఫ్ 2కి అరుదైన ఘనత

Indian Panorama 2019 in Goa Indian Panorama 2019 in Goa రిటర్న్ అఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టి చూస్తే ఎఫ్ 2 ఈ ఏడాది అతిపెద్ద హిట్ అని చెప్పుకోవాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై దుమ్ము దులిపింది. సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలంటే బెటర్ గా ప్రేక్షకుల ఆదరణ పొంది 80 కోట్ల పైగా షేర్ కలెక్టు చేసింది.

ఇప్పుడు ఈ సినిమాకు మరో గౌరవం దక్కింది. గోవాలో జ‌ర‌గ‌బోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా ప్ర‌ద‌ర్శ‌న‌కు ఈ సినిమా ఎంపికైంది. ఈ వేడుక‌లో 76 దేశాల‌కు చెందిన‌ 250 సినిమాలు ప్ర‌ద‌ర్శితం కానున్నాయి. ఈ లిస్టులో 26 ఫీచ‌ర్ ఫిలింస్‌లో ఎంపికైన ఏకైక తెలుగు సినిమాగా ఎఫ్ 2 అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకుంది.

ADVERTISEMENT

ఈ వేడుక న‌వంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో జరగనుంది. మరోవైపు తెలుగులో బంపర్ హిట్టైన ఈ సినిమాను హిందీలో రీమేక్ ప్లాన్ చేసారు. హిందీలో ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. హిందీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనీస్ బజ్మీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని వినికిడి.

అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. కామెడీ అనేది యూనివర్సల్ సబ్జెక్టని, హిందీ ప్రేక్షకులు కూడా దీనికి తప్పకుండా కనెక్టు అవుతారని దిల్ రాజు గట్టి నమ్మకం. మరోవైపు చిత్రంలోనే ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 తీయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అందులో రవితేజ నటించవచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT
Latest Stories