బాజీరావు మస్తానీ’ సినిమాలో బాలకృష్ణ..?

fan made GautamiPutra Satakarni Movie Teaserరన్వీర్ సింగ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా నటించిన “బాజీరావు మస్తానీ” ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. చారిత్రాత్మక కధతో కూడుకున్న ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తే… అలాగే ఆ సినిమా టైటిల్ “గౌతమీపుత్ర శాతకర్ణి” అయితే… సరిగ్గా ఇదే ఆలోచనతో నందమూరి అభిమాని ఒకరు ఆలోచించినట్లున్నారు..!

ADVERTISEMENT

అంతే ‘బాజీరావు మస్తానీ’ ట్రైలర్ ను ఎడిట్ చేసి, రన్వీర్ స్థానంలో బాలకృష్ణ ఫోటోను మార్ఫ్ చేసి ఒక టీజర్ ను కట్ చేసారు. నిజంగా బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి”లో ఎలా ఉంటారో తెలియదు గానీ, కట్ చేసిన ఈ టీజర్లో ఉన్నట్లుగా బాలయ్య బాబు ఉంటే ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఖాయం అన్న టాక్ సొంతం చేసుకుంది. చారిత్రాత్మక కధలలో బాలకృష్ణ సరిపోయినట్లుగా మరొకరు సరిపోరు అనే విధంగా ట్రైలర్లో బాలయ్య కనపడ్డారు మరి..!

ADVERTISEMENT
Latest Stories