ట్రైలర్ టాక్ – మళ్ళీ ‘జమజచ్చ’ వదిలారు… ఫుల్ రొమాన్స్..!

fashion-designer-so-ladies-tailor-trailer-talkనటకిరిటీ రాజేంద్రప్రసాద్ “లేడీస్ టైలర్”ను ఈ తరం ప్రేక్షకులకు అనుగుణంగా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో దర్శకుడు వంశీ “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” ద్వారా చూపించబోతున్నారని స్పష్టమైంది. దాదాపుగా నాటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో, ఈ తాజా చిత్రం అలా ఉంటుందన్న సంకేతాలను ధియేటిరికల్ ట్రైలర్ సంకేతాలు ఇస్తోంది.

ADVERTISEMENT

‘మన్మధ రేఖ’ పేరుతో ముగ్గురు భామలతో హీరో సాగించిన రొమాన్స్, ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్… ఇవన్నీ ‘లేడీస్ టైలర్’ను జ్ఞప్తికి తెస్తున్నాయి. ‘గోపాలం’ పాత్రలో సుమంత్ అశ్విన్ నాటి రాజేంద్రప్రసాద్ రేంజ్ లో అయితే మురిపించడం కష్టమే అని డిక్లేర్ చేయవచ్చు. అయితే ముగ్గురు భామలుగా నటించిన అనీషా అంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్షల అందచందాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ చెప్పవచ్చు.

మణిశర్మ అందించిన సంగీతం మరో ప్లస్ పాయింట్ కాగా, ‘లేడీస్ టైలర్’ను ఫ్రీమేక్ చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే ‘లేడీస్ టైలర్’ సినిమాపై ఇప్పటికీ ఉన్న క్రేజ్ రీత్యా ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం తేలికే అని చెప్పవచ్చు. మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాను జూన్ 2వ తేదీన విడుదల చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేసారు.

ADVERTISEMENT
Latest Stories