ఆ ‘ఐ ఫోన్’ సమాచారం విలువ 6.60 కోట్లు విలువ..!

FBI paid more than $1.3 million to hack  San Bernardino iPhoneఅమెరికాలోని శాన్ బెర్నార్డినోపై దాడి చేసిన ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐ ఫోన్ ను అన్ లాక్ చేసి అందులోని సమాచారాన్ని తెలుసుకునేందుకు దాదాపు 6.6 కోట్లు పైగా ఖర్చు చేసినట్టు యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జేమ్స్ కామే వెల్లడించారు. ఇది ఓ హై ప్రొఫైల్ కేసు కాబట్టే అంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, ఈ ఫోన్ నుంచి ఉగ్రవాదులకు చెందిన ఎంతో సమాచారం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

గత సంవత్సరం డిసెంబర్ 2న ఉగ్రదాడి చేసిన రిజ్వాన్ 14 మందిని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. తన దృష్టిలో ఆ ఫోన్ కు అంత పెద్ద మొత్తం డబ్బు ఖర్చు పెట్టి అన్ లాక్ చేయించడం సరైన నిర్ణయమేనని భావించినట్టు కామే వెల్లడించారు. ఈ ఐ ఫోన్ ను అన్ లాక్ చేసింది ఎవరన్న విషయాన్ని ఎఫ్బీఐ అధికారికంగా వెల్లడించకపోయినా, ఇజ్రాయిల్ కు చెందిన ఓ టెక్ కంపెనీ సాయపడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories