
జనసేన – టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకున్న క్షణం నుంచి వైసీపీ ఫ్యాన్ రెగ్యులేటర్ సరిగా పనిచేస్తున్నట్టు లేదు. ఏవిధంగా అయితే పాడైన రెగ్యులేటర్ ఎటు తిప్పినా ఒకేరకంగా పని చేస్తుందో ఈ వైకాపా నాయకులు కూడా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఉదాహరణకు అది టీవీ డిబేట్ అయినా, మీడియా ప్రెస్ మీట్ అయినా, వైసీపీ సభలైనా ఒకటే ప్రశ్న దగ్గరకు వచ్చి ఆగుతున్నారు.
2019 ఎన్నికల ముందు పవన్ చేసిన పోరాటయాత్రలో అప్పటి ప్రభుత్వమైనా టీడీపీ పాలనను విమర్శిస్తూ, బాబు అవినీతిపరుడు అంటూ పవన్ చేసిన ఆరోపణలను చూపిస్తూ అప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని నిందించిన పవన్ ఇప్పుడు అదే టీడీపీ పార్టీకి ఎలా మద్దతు తెలుపుతారు? అంటూ తెగ గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారి పవన్ టీడీపీ పార్టీని విమర్శించిన సందర్భాన్ని విశ్లేషిస్తే…,అప్పుడు జనసేన పార్టీ ఒంటరిగా పోటీకి సిద్దమయ్యింది. అధికారంలోకి రావాలంటే అధికార పార్టీనే తమ ప్రత్యర్థి అవుతుంది.
అప్పుడు ఏ పార్టీ అయినా ఎవరిని విమర్శించాలి, ప్రభుత్వాన్నే విమర్శించాలి. పవన్ కూడా అదే చేశారు. ఒకానొక సందర్భంలో పవన్ దీనికి వివరణ కూడా ఇచ్చారు. టీడీపీ పార్టీతో జనసేన ఎప్పుడు సిద్దాంత పరంగానే విభేదించిందని, రాజకీయాలలో ఇవి సర్వ సాధారణమైన అంశం అంటూ కొట్టిపడేశారు. అయినా టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు నోరు మెదపని పవన్ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి దాని పై విమర్శలు చేస్తూ ప్రభుత్వ విధానాలను తప్పు పడుతున్నారు అంటూ వార్తలు ప్రచారం చేసే ఈ వైకాపా నాయకులకు, బ్లూ మీడియా వారికి ఒక నిర్దిష్ట అభిప్రాయం అనేది ఉండదా?అంటూ నవ్వుకుంటున్నారు సామాన్య ఓటరు.
ఒకసారి టీడీపీ ని పవన్ అసలు తిట్టనేలేదు అంటారు. మరో సారి టీడీపీ పై అన్ని విమర్శలు చేసి ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటావు అంటూ రెండు విభిన్న ప్రకటనలు చేస్తూ వారి విలువను వారే తీసుకుంటున్నారు వైకాపా నేతలు. అలాగే జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన మొదటిలో ఆ పార్టీ పైన, ఏకంగా వైస్సార్ సతీమణి విజయలక్ష్మి, జగన్ లను ఉద్దేశించి అసెంబ్లీ లోనే బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఓపక్కసారి గుర్తుచేసుకుంటే ఇదే ప్రశ్న జగన్ ను కూడా అడగాల్సి వస్తుంది సదరు వైకాపా నాయకులు.
ఇప్పుడు వైసీపీ పార్టీలో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారిలో వైస్ రాజశేఖర్ రెడ్డి ని, వైస్ జగన్ మోహన్ రెడ్డి ని విమర్శించిన వారే అధికశాతంలో ఉన్నారనేది వైసీపీ నేతలు మరిచినట్టున్నారు. ఒక్కసారి యు ట్యూబ్ సర్చ్ లోకి వెళితే ఆ వైకాపా నాయకుల చిట్టా కూడా కళ్ళముందు ప్రత్యేక్షమవుతుంది. తాజాగా పక్క రాష్ట్రంలో జరిగిన వైస్ షర్మిల ఉదంతాన్ని తీసుకున్నా కూడా వైసీపీ నేతల ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. తమ తండ్రి కష్టంతో రాష్ట్రంలో పదేళ్ళపాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.వైస్ మరణానంతరం వైస్ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకు తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
తన తండ్రి కష్టంతో అధికార హోదా సంపాదించుకుని తన అన్నను జైలు పాలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ అంటూ భావోద్వేగ ప్రకటనలు చేశారు వైస్ షర్మిల.అలాగే తన బిడ్డపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపించిన పార్టీని క్షమించేది లేదని శపధాలు చేశారు వైస్ విజయలక్ష్మి. ఇదంతా గడిచిపోయినా గతం. 2021 లో టి.వైసీపీ పార్టీని స్థాపించిన షర్మిల తెలంగాణ రాజకీయాలలో తన అదృష్టం పరీక్షించుకోవాలని ఆశపడింది.
కానీ కట్ చేస్తే 2023 తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పై అన్ని ఆరోపణలు చేసిన వైస్ విజయ లక్ష్మి, వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయాలని ప్రయత్నించి అది బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతు తెలిపి తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎటువంటి సంబంధం లేదని వారికి క్లీన్ చీట్ ఇచ్చారు ఈ ఇద్దరు వైస్ కుటుంబ సభ్యులు.
“రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు” అంటూ ఎవరు ఉండరు అనేదే ఈ కథనం సారాంశం.దీనికి మంచి ఉదాహరణ కూడా వైస్ జగనే.రాష్ట్ర విభజన సమయంలో తన పై రాళ్ళేపించిన తెలంగాణ నాయకులు ఇప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితులుగా మారిపోయారు.వైకాపా నాయకులు ఎవరైనా సరే ఇటువంటి ప్రశ్న అడగదలచుకుంటే దానికి ముందు వరుసలో నిలబడేది జగన్ అతని కుటుంబం సభ్యులే అనేది ఇప్పటికైనా వైకాపా నాయకులు గ్రహించాలని ఆశిద్దాం.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…