
సామాన్య ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకున్న ‘రింగింగ్ బెల్స్’ సంస్థ, 2,500 విలువ గల స్మార్ట్ ఫోన్ ను 251కే ఇస్తామని చెప్పడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సదరు కంపెనీపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే అప్పటికే ఆ సంస్థ ప్రకటనకు హోరెత్తిన మద్దతుతో 30 వేల మంది ‘ఫ్రీడం 251’ ఫోన్లను బుక్ చేశారు. మరో 7 కోట్ల మంది కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
విమర్శల జడివాన నేపథ్యంలో 30 వేల మంది చెల్లించిన సొమ్మును వాపస్ చేసిన రింగింగ్ బెల్స్ కనుమరుగైందని భావించిన తరుణంలో సోమవారం నాడు డెలివరీ డేట్ ప్రకటన జారీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పధ్ధతిన ఫోన్లను అందించిన తర్వాతే వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటామని డైరెక్టర్ మోహిత్ గోయల్ పేర్కొన్నారు. దీంతో సదరు సంస్థపై వెల్లువెత్తిన విమర్శలకు సరైన సమాధానం చెప్తున్నట్లవుతోంది.
A long-discussed change to how international students stay in the United States is now nearing…
The decision to bring Hari Gowra on board for the background score of Chiranjeevi's Vishwambhara…