
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు, తెలంగాణలో మత రాజకీయాలు జరుగుతుంటాయనేది వాస్తవం.
తెలంగాణలో రెండు మతాలు, మతస్తులు బలంగా ఉన్నందున ఆ ఆస్కారం ఏర్పడగా, ఆంధ్రాలో కులాభిమానం ఎక్కువ గనుక అవే రాజకీయాలను శాశిస్తున్నాయి. అయితే కేసీఆర్ పుణ్యమాని తెలంగాణలో కూడా మెల్లగా కుల రాజకీయాలు మొదలయ్యాయి.
అయితే ఏపీలో మత రాజకీయాలకు ఆస్కారం ఉందా?అంటే లేదనే చెప్పవచ్చు. బహుశః అందుకే హిందుత్వ అజెండాతో పనిచేసే బీజేపీ ఏపీలో రాణించలేకపోతోందని చెప్పవచ్చు.
అలాగని బీజేపీ కుల రాజకీయాలకు అతీతం ఏమీ కాదు. ఏపీ బీజేపీలో కూడా కులాల ప్రభావం ఉంది. ఎన్నికల సమయంలో ఎంతో కొంత కులం కార్డు కూడా వాడుతుంది. కానీ టిడిపి, వైసీపి అంతగా కాదు.
తెలంగాణలో బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నా చిన్న చిన్న విజయాలు సాధించగలుగుతోంది కానీ నేటికీ సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది. అలాంటప్పుడు ఏపీలో మత రాజకీయాలు మాత్రమే చేస్తామని బీజేపీ మడి కట్టుకొని కూర్చుంటే ఎప్పటికీ బలపడలేదు. సొంతంగా అధికారంలోకి రాలేదు.
కనుక మత రాజకీయాలకు ఆస్కారమే లేని ఏపీలో బీజేపీ ముందుకు సాగడం ఎలా?అని బీజేపీ పెద్దలు ఆలోచించకుండా ఉంటారని అనుకోలేము. బహుశః ఈ ప్రశ్నకు సమాధానంగా వారు పవన్ కళ్యాణ్‌ని ఎంచుకొని ఉండవచ్చనిపిస్తుంది. ఇటీవల ఆయన ప్రసంగాలు, దీక్షలు, హడావిడి వగైరా చూస్తుంటే.
అయితే ఇలా అనుకోవడం కూడా తొందరపాటే అనుకోవచ్చు. ఎందువల్ల అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎటువంటి భావజాలానికి ప్రభావితం అవుతుంటారో ఎవరూ చెప్పలేరు. ఓసారి చేగువెరా గురించి మాట్లాడుతారు. మరోసారి గురజాడ, కాళోజీ, ఝాషువా వంటివారి సాహిత్యం గురించి మాట్లాడుతుంటారు.
ప్రస్తుతం సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. కనుక ఇదీ అటువంటి దశ మాత్రమేనా లేక బీజేపీవాదిగా పవన్ కళ్యాణ్ రూపాంతరం చెందుతున్నారా? అనే సందేహానికి సమాధానం మరికొంత కాలం తర్వాత ఆయన ప్రసంగాలు, వ్యవహారశైలితో తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ హిందూమతం, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏపీ బీజేపీ మౌనంగా ఉండిపోవడమే ఈవిదంగా ఆలోచింపజేస్తోంది.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…