Telugu

ఇది గుర్తుంచుకోండి..! తరువాత మాట్లాడుకుందాం..!

“ఇది గుర్తుంచుకోండి… తరువాత మాట్లాడుకుందాం…” జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తన ప్రత్యర్థి మీద వాడిని డైలాగ్ ఇది. అయితే ఈ రోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత బీజేపీ ముఖ్య నాయకులలో ఒకరైన జీవీఎల్ తెలంగాణాలో తాము ప్రత్యర్థిగా భావించే కేసీఆర్ పై ఉపయోగించారు.

దేశంలో బీజేపీ సాధించిన విజయపరంపరను చూసి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నులో వణుకు మొదలైందని., ఇప్పటికైనా దేశంలో బీజేపీ బలం ఏమిటో తెలుసుకోని మెలగాలని చురకలు అంటించారు. “దేశాన్ని తాము రక్షిస్తామంటూ.., మూడవ ఫ్రంట్ అంటూ…” బీజేపీ వ్యతిరేక శక్తులంటిని ఒకే తాటి పైకి తీసుకు వస్తానని ఈ భాద్యతను తన భుజాలపై మోస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ నోట ఇప్పుడు మాట కూడా రావడం లేదని జీవీఎల్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

ADVERTISEMENT

ఇప్పటికి బీజేపీ మీద కానీ, మోదీ నాయకత్వం మీద కానీ ప్రజల్లో సానుకూల దృక్పధం తగ్గలేదని 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని ఒక రకంగా జోస్యమే చెప్పారు. ఇది రాసి పెట్టుకొండి…! అంటూ పంచ్ డైలాగ్స్ పేలుస్తున్నారు జీవీఎల్ నరసింహారావు. ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో అయినా కేసీఆర్ బీజేపీ మీద చేసే యుద్ధాన్ని ఆపుతారో లేదో వేచి చూడాలి.

గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇదే విధంగా మాటల దాడిని బీజేపీ మీద సంధించి ఎన్నిక ఫలితాలు వచ్చిన తరువాత ఆవేశపడ్డాం… అని బాధపడాల్సిన పరిస్థితిలోకి చంద్రబాబును తీసుకెళ్లారు. ఇప్పుడు అదే విధంగా కేసీఆర్ ను కూడా బీజేపీ పెద్దలు తీసుకెళ్తారేమో అని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

ఏది ఏమైనప్పటికి కేసీఆర్ “ఇది గుర్తుపెట్టుకో… తరువాత మాట్లాడదాం…” అని “లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా” అన్న చందంగా కేసీఆర్ పై విమర్శలతో రెచ్చిపోయారు జీవీఎల్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ram’s Extreme Step: Bold Reinvention or Self-Destruction?

After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…

1 hour ago

Pics: Simran Dhanwani Sizzles In Bold Red Saree Look

Simran Dhanwani is redefining the classic red saree with a bold, contemporary twist. Draped in…

2 hours ago