బాబు తో గల్లా…దేనికి సంకేతమో.?



నాడు ఇంటోకో ఐటీ ఉద్యోగం అనే నినాదంతో తెలుగు రాష్ట్రాలకు ఐటీ ని పరిచయం చేసిన చంద్రబాబు నేడు ఇంటికో పారిశ్రామిక వేత్త అంటూ రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇనోవేషన్ హబ్ ను ప్రారంభించారు.

ADVERTISEMENT

ఈ హబ్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్టాటప్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు, 20 వేల స్టార్ట్ప్స్ ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ ఇనోవేషన్ హబ్ ముందుకెళ్లనుంది.

ఇక్కడ ఇంక్యూబేషన్, పండింగ్, మెంటర్ షిప్, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలు లభిస్తాయి. ముఖ్యంగా డీప్ టెక్, AI, క్లిన్ ఎనర్జీ, వ్యవసాయ టెక్నాలజీ వంటి రంగాల అభివృద్ధికి ఇది కీలక వేదిక కానుంది.

అయితే అమరావతి కేంద్ర హబ్ తో పాటుగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి వంటి ముఖ్య నగరాలలో సైతం స్పోక్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకలో కనిపించిన ఒక దృశ్యం రాజకీయ వార్తగా మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నేడు మంగళగిరిలో జరిగిన రతన్ టాటా ఇనోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తో పాటుగా టీడీపీ మాజీ ఎంపీ, అమరరాజ చైర్మన్ గల్లా జయదేవ్ కూడా వేదికను పంచుకున్నారు.

అమరరాజా, రతన్ టాటా ఇనోవేషన్ హబ్ యొక్క నాలెడ్జ్ పార్టనర్ లలో ఒకరు కావడంతో జయదేవ్ కు కూడా ఆ రకంగా ఆహ్వానం అంది ఉండవచ్చు. కానీ గల్లా, బాబు ఒకే వేదికను పంచుకోవడంతో ఇది రాజకీయ చర్చకు తెరతీసింది.

అయితే గత వైసీపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులు తట్టుకోలేక రాజకీయాల నుంచి తప్పుకున్న గల్లా ఈ మధ్య కాలంలో తరచూ రాజకీయ వార్తలలో నిలుస్తున్నారు. మొన్నీమధ్య కాణిపాకం దైవ దర్శనానికి వెళ్లిన గల్లా తన పొలిటికల్ రీ ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

రాజకీయాలకు దూరమైన తానూ ఇప్పటికి టీడీపీ కి దూరం కాలేదని, ఆ దేవుని దయ, పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉంటే తప్పకుండా టీడీపీలోకి పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందంటూ తన మనోగతాన్ని అటు పార్టీ అధిష్టానానికి ఇటు ప్రజలకు చెప్పకనే చెప్పారు గల్లా.

అయితే 2024 ఎన్నికల నుంచి విరమించుకోవడం, రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించడం గల్లా తీసుకున్న అతిపెద్ద రాజకీయ తొందరపాటు నిర్ణయం అనే భావన గల్లా ను వేధిస్తోందని, ఆ లోటు భర్తీ చేసుకోవడానికి గల్లా రాజ్యసభ ద్వారా తన పొలిటికల్ రీ ఎంట్రీ ని ఆశిస్తున్నారు అనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నాయి.

తన స్థానంలో గుంటూరు ఎంపీ గా పోటీ చేసి గెలిచిన పెమ్మసాని తన తొలి అడుగుతోనే కేంద్ర మంత్రి వర్గంలో చోటు సాధించారు, ఎన్డీయే ప్రభుత్వంలో భాగమయ్యారు. ఈ పరిణామాలన్నిటి దృష్ట్యా గల్లా CBN తో కలిసి వేదికను పంచుకోవడంతో అనేక ఊహాగానాలకు తావిస్తుంది. అయితే ఇవన్నీ ఉట్టి పుకార్లే అంటూ ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

23 minutes ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

43 minutes ago