
Political Songs Stir Ganesh Fest Debate
రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలబడకపోయినా పర్వాలేదు. కానీ ఈ సమాజాన్ని ఇంకా చెడగొట్టకుండా ఉంటే చాలు.
ఇప్పటికే దేశంలో ప్రజలు కుల, మతాలు, ప్రాంతాలు, భాషల వారీగా విడిపోయున్నారు. ఇప్పుడు పార్టీల వారీగా కూడా విడిపోతున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఇప్పటిలా గతంలో ఎన్నడూ ప్రజలు వాటి తరపున విడిపోలేదు. ఎన్నికల వరకే వారిపై కాస్త ప్రభావం ఉండేది. తర్వాత అందరూ కలిసి మెలిసి జీవించేవారు.
కానీ ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ ఎన్నికల వరకు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. చివరికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నప్పుడు కూడా పార్టీల వారీగా విడిపోయి గొడవలు పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రజలందరినీ కలపాల్సిన రాజకీయ పార్టీలు వాటాలు వేసి వారిని పంచేసుకుంటున్నాయి. తమని ప్రత్యర్థులపై ఆయుధాలుగా వాడుకుంటున్నారని గ్రహించకనో లేదా ఆయా పార్టీలతో కలిగే ప్రయోజనాలు, పలుకుబడి కోసమో ప్రజలు కూడా వాటి మాయలో చిక్కుకుపోతున్నారు.
నాడు బ్రిటిష్ వారు ‘డివైడ్ అండ్ రూల్’తో దేశాన్ని దాదాపు రెండు శతాబ్దాలపాటు ఏలితే, నేడు మన నాయకులు కూడా అదే విధానంతో ప్రజలను విడదీసి రాజకీయ లబ్ధి పొందుతున్నారనే విమర్శలను ఎవరైనా కాదనగలరా? మన సాటి ప్రజలను శత్రువులుగా భావించి కత్తులు దూసుకోవడం ఎంత దౌర్భాగ్యం!
సమాజాన్ని నిలువునా చీల్చుతున్న రాజకీయ పార్టీలు అంతటితో సంతృప్తి చెందడం లేదు. ఇంకా కొత్త కొత్త విష సంస్కృతులను ప్రవేశపెడుతున్నారని రేణుకా దేశాయ్ వంటి వారు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
వినాయక చవితి మండపాల వద్ద, నిమజ్జన ఊరేగింపులలో డీజేలు పెట్టుకొని, మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్నట్లుగా పూనకం వచ్చినట్లు డాన్సులు చేయడమే మన సంస్కృతా? ఇది సబబేనా? అని ఆమె వంటి వారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఆమె ప్రశ్న ‘డీజే ముందు శంఖం ఊదినట్లే’ అయ్యింది.
ఊరేగింపులలో డీజేలు పెట్టవద్దని, ముఖ్యంగా రాజకీయ పార్టీల పాటలు పెట్టవద్దని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చెబితే, దానినీ బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పు పడుతున్నారు.
పైగా కమిషనర్‌గా వద్దంటున్నా ఆయన ముందే మన పిల్లలు కేసీఆర్ పాటలు పెట్టుకొని డాన్సులు చేశారని మెచ్చుకున్నారు. తెలంగాణలో గడ్డి పరక కూడా గడ్డ పారగా మారుతుందని నిరూపించి చూపారని కేటీఆర్ మెచ్చుకున్నారు.
పవిత్రమైన పూజా మండపాల వద్ద ఇదివరకు సినిమాల్లోని భక్తి పాటలు పెట్టేవారు. కానీ ఇప్పుడు అశ్లీల పాటలు కూడా పెడుతూ వాటికి డాన్సులు కూడా చేస్తున్నారు.
ఇప్పుడు కేసీఆర్ పాటలు పెట్టి డాన్సులు చేశారు. వద్దంటే కేటీఆర్ వంటివారు జోక్యం చేసుకొని కమిషనర్‌నే తప్పు పడుతున్నారు.
అదే మండపం లేదా ఊరేగింపులో మరెవరో కాంగ్రెస్, బీజేపీ జెండాలు పెట్టి ఆ పార్టీ పాటలు పెడితే ఏమవుతుంది? అప్పుడు అక్కడ ఘర్షణలు జరిగి, కేసులు, అరెస్టులు జరిగితే ఎవరిని నిందిస్తారు?
ఆయా పార్టీలనా? కాదు.. మళ్లీ వాళ్లే పోలీసులను నిందిస్తారు కదా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఇలాగే చేస్తే అంగీకరిస్తుందా?
ఈ విష సంస్కృతి ఆంధ్రాకు పాకడం పెద్ద కష్టం కాదు. అప్పుడు ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక కరోనా వంటి ఈ విష సంస్కృతీ ఏపీకి వ్యాపించక ముందే కూటమి ప్రభుత్వం టీకాలు వేయడం చాలా అవసరం.
గణేష్ నిమజ్జనాలు మొదలైనప్పటి నుండి రేవంత్ రెడ్డికి నిద్ర కరువైంది.
కేసీఆర్ గారి పాటలు పెడితే కేసులు పెడతామని కమిషనర్లతో హెచ్చరించినా ప్రజలు భయపడట్లేదు.
"గడ్డిపోచ కూడా గడ్డపారై తిరగబడినట్లు" కిషన్ రెడ్డి, సజ్జనార్ల ముందే కేసీఆర్ పాటలతో హోరెత్తించారు.
పోయింది కేవలం అధికారం… pic.twitter.com/cmKJbpcOhb
— BRS Party (@BRSparty) September 27, 2026
Nani’s much-hyped The Paradise has completed three days at the box office, and surprisingly, the…
LPU Protest Turns Violent After Viral Rape-Suicide Claims Tension broke out at Lovely Professional University…