
వై నాట్ 175 , వై ఏపీ నీడ్స్ జగన్,నువ్వే మా నమ్మకం జగనన్న…అంటూ వైసీపీ ప్రచార స్లొగన్స్ తో ప్రజల ముందుకెళ్తుంటే టీడీపీ ముఖ్యనేత మాజీ మంత్రి విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తన సోషల్ మీడియాలో జగన్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు.
ప్రజలు “ఏపీ హేట్స్ జగన్”..,”వద్దు వద్దు ఈ జగన్ మళ్ళీ మాకొద్దు ఈ జగన్” అంటూ ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ అంటూ తన X మాధ్యమంలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి జగన్ చేసిన విధ్వంసాన్ని ఒక్క ఫొటోతోనే ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
జగన్ నాలుగున్నరేళ్ల పాలనకు ఈ ఒక్క చిత్రమే ప్రామాణికం కానుంది అన్నట్టు వైసీపీ ప్రభుత్వ కూల్చివేతల లిస్టు పెట్టుకొచ్చారు. ప్రజావేదికతో రాష్ట్రంలో కూల్చివేతలు పునాదులేసిన జగన్ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని పునాదులతో సహా పెకిళించివేశారు.
పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల ధ్వంసంతో మొదలుపెట్టిన విధ్వంసం దేవాలయాల పై దాడుల వరకు కొనసాగింది. ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధి చేసి, పోలవరాన్ని పడుకోబెట్టి, రుషికొండకు గుండు కొట్టి, పరిశ్రమలను బెదరగొట్టి,కులాల చిచ్చులు రేపి,కరెంట్, నిత్యావసరాల ధరలను పెంచి మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచిన కారణంగానే “ఏపీ హేట్స్ జగన్” అంటున్నారు ప్రజలు.
కల్తీ మద్యంతో పేదవాడి ప్రాణాలు హరిస్తున్న ఈ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను తయారు చేసింది.వాలంటీర్ వ్యవస్థతో ప్రజల సామజిక భద్రతను హరించి వేసింది ఈ జగన్ ప్రభుత్వం. పథకాలకు పేర్లు మారుస్తూ ప్రజలను ఏమారుస్తుంది. బాబు హయాంలో కాపులకు అందించిన 5 % రిజర్వేషన్ ను గంగలో కలిపారు. రాజకీయ హత్యలు, రాజకీయ అరెస్టులు, దొంగ హామీలు, దొంగ కేసులతో ప్రతిపక్ష నేతలను భయాందోళనకు గురి చేయడం జగన్ పాలనకు నిదర్శనాలు.
సీపీఎస్ రద్దు హామీని రద్దు చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చెయ్యి చూపారు జగన్. అలాగే దౌర్జన్యాలు, దాడులు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్ఠంగా మారుస్తున్నారు.ఇసుక దోపిడీ, మద్యం మాఫియా,మైనింగ్ దందా, భూకబ్జాలు ఇలా అధికారాన్ని అడ్డగోలుగా వాడుతూ ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. పిల్లలు తాగే పాల నుండి పిల్లలకు పంచె చిక్కి వరకు అంతా నాణ్యత లోపాలే.
పిల్లలకు అందించే విద్య నుండి ,మూగజీవుల ఆరోగ్యం పేరుతో ఈ ప్రభుత్వ స్కామ్లు అన్ని ఒక్కక్కొక్కటిగా బయటకొస్తున్న తరుణంలో అందుకే ఏపీ హేట్స్ జగన్ అంటున్నారు ఏపీ ప్రజలు. దళితుల పై ఆగని దాడులు, కోర్టుల తీర్పులతో అనేకమార్లు ప్రభుత్వానికి పడిన మొట్టికాయలు, సమయానికి పడని ఉద్యోగుల జీతాలు, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఆరోగ్య శ్రీ పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ విధ్వంసాల లిస్ట్ చాంతాడంత వచ్చేలా ఉంది.
వై ఏపీ హేట్స్ జగన్…అనడానికి ఈ లిస్ట్ సరిపోతుందేమోగా! అంటున్నారు టీడీపీ నేత గంటా.మొత్తానికి జగన్ ప్రభుత్వానికి ఇక ఏపీ ప్రజలు ‘క్లోసింగ్ బెల్” కొట్టడానికి రెడీ అయ్యారంటూ గంటా గారు బాగానే చెప్పారు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…