గంటాకు భీమిలి… కళాకి బొత్సతో అగ్నిపరీక్ష!

శుక్రవారం మధ్యాహ్నం టిడిపి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించింది. పొత్తులో భాగంగా టిడిపికి 128 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు లభించగా, వాటిలో 119/13 స్థానాలకు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించింది. ఈరోజు మిగిలిన 9/4 ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులను కూడా ప్రకటించింది.

విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావులను కోరిన సంగతి తెలిసిందే. కానీ గంటా శ్రీనివాస రావు తాను మళ్ళీ భీమిలి నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టి ఆ టికెట్‌ సాధించుకున్నారు.

కనుక చీపురుపల్లిలో  పాతుకుపోయిన మంత్రి బొత్స సత్యనారాయణని కళా వెంకట్రావు ఢీకొనాల్సి ఉంటుంది. ఇది ఆయనకు పెద్ద అగ్నిపరీక్షే అని చేపోచ్చు.

ఈరోజు టిడిపి ప్రకటించిన జాబితాలో ఒంగోలు జిల్లాలోని కదిరి అభ్యర్ధి కందికుంట యశోద అభ్యర్ధన మేరకు ఆమె భర్త కందికుంట ప్రసాద్‌కు టికెట్‌ ఖరారు చేసింది.

రఘురామకృష్ణ రాజుకి బీజేపీ నర్సాపురం టికెట్‌ నిరాకరించడంతో, ఆయన టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ టిడిపి తుది జాబితాలో కూడా ఆయన పేరు కనపడలేదు. ఆయన ఇంకా నర్సాపురం ఎంపీ సీటు కోసం బీజేపీపైనే ఆశపెట్టుకొని ఎదురుచూస్తున్నానని చెప్పారు.

కడప నుంచి వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆయనపై టిడిపి అభ్యర్ధిగా భూపేష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్‌ తరపున వైఎస్ షర్మిల లేదా సునీతా రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.

ఒంగోలు నుంచి లోక్‌సభకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి పోటీ చేస్తారనుకున్నప్పటికీ మళ్ళీ ఆయననే టిడిపి అభ్యర్ధిగా ప్రకటించింది. టిడిపి తుది జాబితాలో అభ్యర్ధుల వివరాలు….

శాసనసభ అభ్యర్ధి లోక్‌సభ అభ్యర్ధి
1 చీపురుపల్లి కళా వెంకట్రావు విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు
2 భీమిలి గంటా శ్రీనివాస రావు ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి
3 పాడేరు కె.వెంకటేష్ నాయుడు అనంతపురం అంబికా లక్ష్మినారాయణ
4 దర్శి గొట్టిపాటి లక్ష్మి కడప భూపేష్ రెడ్డి
5 రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
6 ఆలూరు వీరభద్ర గౌడ్ నోటిఫికేషన్‌ మే 18
7 గుంతకల్లు గుమ్మనూరు జయరాం నామినేషన్స్‌ గడువు మే 25
8 ఆంతపురం దగ్గుబాటి వేంకటేశ్వర ప్రసాద్ పోలింగ్ మే 13
9 కదిరి కందికుంట వెంకట ప్రసాద్ కౌంటింగ్, ఫలితాలు జూన్ 4
ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

స్థానికం నేర్పిస్తున్న కొత్త పాఠాలు!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదోపవాదాలు, అభిప్రాయాలు, సలహాల నుంచి టీడీపీ, జనసేన... రెండు పార్టీలు…

10 minutes ago

KTR Row: Are Politicians Becoming Celebrities?

Congress MLC Balmoor Venkat’s latest comments on KTR have opened up a fresh line of…

18 minutes ago