Telugu

బాలయ్య బాబు అవుట్ స్టాండింగ్… చిరంజీవిదే నెక్స్ట్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలు ఏవీ అంటే… నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా మరియు మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా. ఒకప్పుడు ఈ ఇద్దరి హీరోల మధ్య ఉన్న పోటీ అభిమానులను మాంచి కిక్ ను ఇచ్చేది. అయితే మెగాస్టార్ రాజకీయాల బాట పట్టిన తర్వాత సినీ ఇండస్ట్రీలో పోటీతత్వం కనుమరుగైంది. అయితే తాజాగా ఈ రెండు సినిమాలు షూటింగ్ దశకు చేరుకోవడం… అదీ గాక ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు ప్లాన్ చేసుకోవడంతో అందరి చూపులు ఈ ‘స్టార్ హీరో’ల సినిమాల పైనే ఉన్నాయి.

ADVERTISEMENT

అయితే బాలకృష్ణ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని మలి షెడ్యూల్ కు సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పిక్చర్ కు వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ‘వారియర్’గా బాలకృష్ణ లుక్ మరియు జెండాలతో కూడిన పోస్టర్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దీంతో జనవరికి సిద్దమవుతున్న ‘నందమూరి వర్సెస్ మెగా’ వార్ కు అభిమానులు ‘సై’ అంటున్నారు. బాలకృష్ణ ఫస్ట్ లుక్ కు వచ్చిన స్పందన రీత్యా… సహజంగానే మెగాస్టార్ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందన్న దానిపై ఫోకస్ పడుతుంది.

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న షెడ్యూల్ షూటింగ్ నిర్విరామంగా కొనసాగుతోందని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న ట్రెండ్ రీత్యా మెగాస్టార్ పుట్టినరోజు అయిన ఆగష్టు 22వ తేదీన ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతో ఈ ఇద్దరి అగ్ర హీరోల మధ్య సమరం ‘ఫస్ట్ లుక్’ నుండే ప్రారంభం అంటున్నారు అభిమానులు. బాలయ్య బాబు పాస్ మార్కులను దాటి ‘అవుట్ స్టాండింగ్’ ఫలితం అందుకున్న రీత్యా… మెగాస్టార్ ‘ఫస్ట్ లుక్’కు ఎన్ని మార్కులు పడతాయో వేచిచూడాలి.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Why Prabhas and Akshay Ran Away from Shraddha Kapoor?

Akshay Kumar and Shraddha Kapoor were supposed to clash at the box office in December…

5 minutes ago

Nani’s Big Paradise Request: Will Revanth Reddy Allow?

After the tragic stampede during the Pushpa 2 premiere at Sandhya Theatre in Hyderabad, Tollywood…

26 minutes ago