
వారియర్ లుక్ లో అదిరిపోయే రేంజ్ లో కనపడుతోన్న బాలయ్య బాబు ‘విశ్వరూపం’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకులు కన్నులవిందు చేయనుందన్న మాట. దీంతో 16వ తేదీ “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాకు కీలకంగా మారింది. ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచాలన్నా లేదా ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ దించాలన్నా… ఈ ట్రైలర్ తో తేలిపోనుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను 100 ధియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
సంక్రాంతి బరిలో ఉన్న చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా ఫక్తు మాస్ మసాలా మూవీ కావడంతో కమర్షియల్ గా ఈ సినిమాకు తిరుగులేకపోవచ్చు. మరి మెగాస్టార్ కమర్షియల్ సినిమాను ఓ చారిత్రాత్మక సినిమాతో డీ కొట్టబోతున్న బాలయ్య బాబు ట్రైలర్ ద్వారా ఆకట్టుకోగలిగితే… ‘ఖైదీ’పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంది. లేదంటే ‘ఖైదీ’కి లొంగిపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో “ఖైదీ”తో “శాతకర్ణి” రణమా? శరణమా? తేలేది డిసెంబర్ 16వ తేదీన..!
The teaser of Chakkora - Lunar Love Bird has been released, offering a mix of…
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…