
మరి ఈ ట్రైలర్ ఎప్పుడు రానుంది? ఎప్పుడు ఈ టాక్ వినపడుతుంది… అన్నది తెలుసుకోవాలంటే డిసెంబర్ 9వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. ఎందుకంటే ఆ రోజునే “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతుందని లభించిన కీలక సమాచారం. ఈ సినిమా ఆడియో విడుదల కంటే ముందుగానే ట్రైలర్ ను విడుదల చేసి అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపే ప్రక్రియకు చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టినట్లుగా కనపడుతోంది.
ఈ సినిమా ఆడియోను డిసెంబర్ 16వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో… ఆడియో కంటే ఒక వారం ముందుగానే ట్రైలర్ విడుదల చేయనుండడం అనేది… సినిమాపై చిత్ర యూనిట్ కు అంత నమ్మకం ఉందా? అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఎవరికీ తెలియని చరిత్ర కావడంతో, ఈ సినిమా కధపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకుంటే టాప్ దర్శకుల జాబితాలోకి క్రిష్ చేరుకోవడం ఖాయమనేది సినీ విశ్లేషకుల మాట.
వై నాట్ 175, ప్రతిపక్షం లేని ఏకైక రాష్ట్రం గా ఏపీ, వై నాట్ కుప్పం.? వై నాట్ మంగళగిరి.?…
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…