రీల్స్ కాలంలో స్పూఫ్ లు ఏం వర్కవుట్ అవుతాయ్

Gayapadda Simham movie showing spoof scenes inspired by KGF, Salaar, and Pokiri films in Telugu cinema

ఒకప్పుడు మన సినిమాల్లో ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, అలీ వంటి కమెడియన్స్ హిట్ సినిమాల స్పూఫ్ లు చేసినప్పుడు అవి బాగానే వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా ఎమ్మెస్ నారాయణ “దూకుడు” సినిమాలో “సింహా, మగధీర”లోని కొన్ని సన్నివేశాల్ని స్పూఫ్ చేసినప్పుడు జనాలు తెగ ఎంజాయ్ చేసారు. బ్రహ్మానందం, ధర్మవరపు చేసిన స్పూఫ్ లకి లెక్కే లేదు.

అయితే.. సినిమాల్లో సూపర్ హిట్ స్పూఫ్ లకి “జబర్దస్త్” లాంటి కామెడీ షోలు బ్రేక్ వేశాయి. టీవీ కమెడియన్లే టీవీ షోల్లో పాపులర్ సినిమాల క్యారెక్టర్స్ లేదా సీక్వెన్సులను అత్యద్భుతంగా, ఎంటర్టైనింగ్ గా రీక్రియేట్ చేస్తున్నారు. ఆ ట్రెండ్ కొన్నాళ్లకి స్మార్ట్ ఫోన్స్ కి చేరుకుంది. రీల్స్ లోనే చాలామంది స్పూఫ్ లు చేసేస్తున్నారు. దాని కోసం వాళ్లు పెట్టే ఎఫర్ట్స్ కూడా గట్టిగానే ఉంటాయి.

ADVERTISEMENT

ఇలాంటి తరుణంలో.. చాలారోజుల తర్వాత ఒక తెలుగు సినిమాలో పలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల స్పూఫ్ లను పెట్టారు. అదే “గాయపడ్డ సింహం”. ఈ సినిమాలో “కేజీఎఫ్, బొమ్మరిల్లు, సలార్, పోకిరి, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి” వంటి సినిమాల స్పూఫ్ లను సినిమాలో పెట్టడం అనేది సరిగా వర్కవుట్ అవ్వలేదు. ఒక్క “పోకిరి” స్పూఫ్, అది కూడా జేడీ చక్రవర్తి వల్ల కాస్త నవ్వించగలిగింది కానీ.. సలార్ స్పూఫ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకోలేకపోయింది.

ఇది కామెడీ రాసుకుంటున్న ఫిలిం మేకర్స్ & రైటర్స్ కి ఒక వార్నింగ్ లాంటిది. ఇలా స్పూఫ్ లతో సినిమాల్ని చుట్టేయడం అనేది ఆడియన్స్ ఎంకరేజ్ చేయడం లేదు. సో, కాస్త ఒరిజినల్ కంటెంట్ & కామెడీ మీద కాన్సన్ ట్రేట్ చేస్తే బెటర్.

ADVERTISEMENT
Latest Stories