ఫైనల్ గా… చిరు సినిమాను కిందకి నెట్టాడు..!

Vijay-Deverakonda-Geetha-Govindam-Collections (2)బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిన “గీత గోవిందం,” యుఎస్ లో దాదాపుగా క్లోజింగ్ దశకు చేరుకుంది. ముగింపు దశలోనూ ఈ సినిమా వసూళ్లు మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నెంబర్ 150″ను అధిగమించడం లేటెస్ట్ న్యూస్. యుఎస్ లో మెగాస్టార్ మూవీ 2.42 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేయగా, విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ 2.44 మిలియన్స్ ను చేరుకొని, మెగాస్టార్ మూవీని కిందకి నెట్టాడు.

ఈ ఆదివారం నాటితో “గీత గోవిందం” కధ ముగిసినట్టే. మెగాస్టార్ మూవీని దాటిన ఈ సినిమా “మహానటి” పేరుతో ఉన్న 2.50 మిలియన్ డాలర్స్ ను కూడా అందుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ‘మహానటి’ రికార్డును కూడా అధిగమిస్తే… ఆల్ టైం జాబితాలో 6వ స్థానంలో “గీత గోవిందం” నిలవనుంది. ‘బాహుబలి’ రెండు పార్ట్ లు, ‘రంగస్థలం, భరత్ అనే నేను, శ్రీమంతుడు’ సినిమాలు మొదటి 5 స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories