
[m9ad]
ప్రస్తుతం 29వ సంవత్సరంలో ఉన్న విజయ్, ఒకప్పుడు తనకు 40 ఏళ్ళు వచ్చేవరకు పెళ్లి చేసుకోకూడదని భావించానని, అయితే “గీత గోవిందం” సినిమా ప్రభావమో ఏమో గానీ, ప్రస్తుతం 35 వరకు దించానని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామంటూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విజయ్. అయితే తన మైండ్ సెట్ కు పెద్దలు కుదిర్చిన వివాహం సరిపోదంటూ కుండబద్దలు కొడుతూ చెప్పారు.
ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పిన విజయ్, ఆమె తెలంగాణాకు చెందిన అమ్మాయి కావచ్చు, కాకపోవచ్చు, ప్రపంచంలో ఎవరైనా అయ్యుండొచ్చు, కనెక్ట్ కావాలి కదా… ఒకరికొకరు తెలుసుకోవాలి కదా… అంటూ తన భావాలను పంచుకున్నారు. అలాగే ‘గీత గోవిందం’లో గోవింద్ క్యారెక్టర్ మాదిరి తనకు ప్రత్యేకంగా ఎలాంటి కోరికలు లేవని, కొంచెం కొంచెం ఉండడం ఎవరికైనా సహజమే అంటూ తన పెళ్లి సంగతులను చెప్పుకొచ్చారు.
అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…
చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…