ఈ ఫీట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Glimpse of NBK Stunt in Paisa Vasoolనందమూరి నటసింహం ఫీట్లు చేస్తున్నాడు… అవును… అయిదు పదులు దాటి ఆరు పదుల వయసుకు చేరువవుతున్న బాలకృష్ణ, ‘పైసా వసూల్’ సినిమా కోసం కారులో అవాక్కయ్యే స్టంట్స్ చేస్తున్నాడు. బహుశా నవతరం హీరోలు కూడా ఇలా చేస్తారో లేదో గానీ, ‘పైసా వసూల్’ కోసం బాలయ్య ఓ రేంజ్ లో కష్టపడ్డారని తాజాగా విడుదల చేసిన ఓ వీడియో స్పష్టం చేసింది.

సాధారణంగా కారు రేసింగ్ సన్నివేశాలలో హీరోలు పాల్గొనే సన్నివేశాలను డూప్ లతో తెరకెక్కించడం ఇండస్ట్రీలో సర్వ సహజం. ముఖ్యంగా విదేశాలలో తీసే షూటింగ్ పోరాట సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో స్థానిక వాతావరణానికి అనుగుణంగా లోకల్ వారితోనే ఎక్కువ శాతం షూటింగ్ చేస్తుంటారు. కానీ బాలయ్య మాత్రం కారును ఓ బైక్ మాదిరి గిరాగిరా తిప్పేయడం చెప్పుకోదగ్గ విషయమే.

ADVERTISEMENT

‘హి నీడ్స్ నో స్టంట్ డ్రైవర్’ అంటూ విడుదల చేసిన ఈ చిన్న టీజర్ నందమూరి అభిమానులను అలరిస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి శ్రియా శేరన్ కన్నులవిందు చేయనుంది.

ADVERTISEMENT
Latest Stories