
రాజమౌళి విజువల్ వండర్ హద్దులను చెరిపేసింది. ఎక్కడో జపాన్ లో చరణ్ తారక్ విన్యాసాలు చూసి ఆడియన్స్ మైమరిచిపోతున్నారు. కెనడా సెకండ్ షోలలో ఈలలు కేకలు వినిపిస్తున్నాయి. యుఎస్ లో స్పెషల్ ప్రీమియర్లు వేస్తే జక్కన్నను థియేటర్లోనే ఇంటర్వ్యూ చేయడం అమెరికా మీడియా గర్వంగా ఫీలవుతోంది. స్పోర్ట్స్ స్టార్స్, హాలీవుడ్ సెలబ్రిటీలు, కార్పొరేట్ కంపెనీల సిఈఓలు ఒకరేమిటి వారు వీరు అనే తేడా లేకుండా ఆర్ఆర్ఆర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ తప్పక చూడమని ట్వీట్ల ద్వారా రికమండ్ చేస్తున్నారు. తాజాగా గోల్డెన్ గ్లొబ్ నామినేషన్లలో బెస్ట్ పిక్చర్ కు అర్హత సాధించడం దానికి ఇంటర్నేషనల్ కవరేజ్ రావడం జరిగిపోయింది
ఇదంతా పక్కరాష్ట్ర ట్విట్టర్ బ్యాచ్ కి కంటగింపుగా మారింది. అంతే సోషల్ మీడియా వేదికగా విషం చిమ్మడం మొదలుపెట్టారు. ఇక్కడ వాళ్ళ బాధ ఆర్ఆర్ఆర్ ఇవన్నీ సాధిస్తున్నందుకు కాదు. జబ్బలు చరుచుకుని బాహుబలిని మించి తీశామని గొప్పలు పోయిన పొన్నియన్ సెల్వన్ 1ని ఎవరూ పట్టించుకోకపోవడమే. ఆ మాటకొస్తే బాగున్న డబ్బింగ్ సినిమాలను నెత్తిన బెట్టుకునే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పీఎస్ 1 పది కోట్ల షేర్ ని టచ్ చేయలేక చతికిలబడింది. హిందీలో కనీసం కార్తికేయ 2 దాటేలా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించలేకపోయింది. ప్రతి రెండు వారాలకో వంద కోట్లు పోస్టర్లలో జోడించుకుంటూ పోవడం తప్ప నిజమేంటో ఆ బ్రహ్మయ్యకే ఎరుక
సదరు బాధాతప్త హృదయాలు జీర్ణించుకోలేని విషయం మరొకటుంది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు అతి దగ్గర్లో ఉంది. రావొచ్చు రాకపోవచ్చు. కానీ దాదాపు గెలిచినంత పని చేసింది. ఇప్పటిదాకా ఏ సౌత్ ఇండియన్ మూవీకి ఇంత గౌరవం దక్కలేదు. గోల్డెన్ గ్లొబ్ లో బెస్ట్ పిక్చర్ కామెడీ క్యాటగిరి అంటేనే అదేదో వడివేలు రేంజ్ నవ్వించే బాపతు అనుకుంటున్నారే తప్ప సదరు కమిటీ కోణంలో దానికర్థం తెలిస్తే సిగ్గుతో చచ్చిపోతారు. గూగుల్ చేస్తే తెలిసిపోయే సింపుల్ విషయాలివి. సరే ఈ గగ్గోల సంగతి ఎలా ఉన్నా ఈ ముసలి కన్నీళ్ల వల్ల మనకొచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడే ఇలా ఉంటే మహేష్ బాబుతో చేయబోయే సినిమా వచ్చాక ఈ దుగ్దతో ఏకంగా అక్కడి గుండెలు ఆగిపోయినా ఆశ్చర్యం లేదు.
Suriya is having a strong 2026 so far. The actor has already delivered two back-to-back…
Baahubali, KGF, Pushpa, RRR and Kantara changed the rules of Indian cinema. They turned Prabhas,…