Telugu

‘మంచి ప్రభుత్వాని’కి సూచిక…ఈ ‘సూపర్ సిక్స్’..!

గత ఏడాది జూన్ లో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం తమ ఆరు నెలల పాలనను ముగించుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ‘నవరత్నాలు’ అంటూ బటన్ నొక్కే పాలన చేస్తే, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ హామీ ఇచ్చి ప్రజా పాలన చేస్తుంది.

అయితే టీడీపీ కూటమి ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఏ మేరకు అమలు చేస్తుందో కానీ ఈ సూపర్ సిక్స్ మాత్రం సమాజానికి మేలు చేయడమే కాదు, ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి అలాగే ఆనందింపచేస్తున్నాయి. వాటి గురించి క్లుప్తంగా కొన్ని పంక్తులు….

ADVERTISEMENT

1 * రాజధాని ‘అమరావతి’…

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే మూడు రాజధానులు అంటూ వైసీపీ ఆడిన మూడు ముక్కలాటతో రాజధాని లేని అనాథ రాష్ట్రంగా నిలబడిన ఆంధ్రప్రదేశ్ కు అమరావతే ఏకైక రాజధాని అంటూ ప్రకటించి ఆ దిశగా అమరావతి పునర్నిర్మాణాన్ని చేపట్టి రాష్ట్ర రూపురేఖలను మార్చబోతుంది. అందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా పట్టాలెక్కుతున్నాయి.

2 * ‘అన్న’ క్యాంటీన్…

వైసీపీ నవరత్నాలతో కూడా కడుపు నిండని కొన్ని కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్న క్యాంటీన్ పథకం కడుపు నింపుతుంది. ప్రస్తుత సమాజంలో 5 రూపాయలకు మంచి క్వాలిటీ ‘టీ’ కూడా దొరకని పరిస్థితులలో 5 రూ.లకు కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టడం అంటే దాని కంటే మంచి పథకం మరొకటి లేదనే చెప్పాలి. ఈ పథకం ఒక్క నిరుపేదలకు కాదు ఆకలి అన్న ప్రతి వాడి కడుపు నింపుతుంది.

3 * ‘బూతులు’ లేని రాజకీయం….

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో బూతులు, దాడులు, వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కక్ష్య సాధింపు రాజకీయాలు చూసి విసిగిపోయిన ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం తన పాలనతో ఆ రాజకీయానికి ముగింపు పలికింది. వైసీపీ హయాంలో కౌరవ సభగా సాగిన చట్ట సభలను గౌరవ సభగా మార్చి, ప్యాలస్ రాజకీయాలు కాదు పరదాల పలకరింపులు కాదు ప్రజల వద్దకే పాలన అనేలా ప్రభుత్వాన్ని నడిపిస్తుంది.

4 * ‘రహదారులకు’ మహర్దశ….

కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడానికి మరో ముఖ్య కారణం ఏపీలో గత ఐదేళ్లు కనీసం మరమ్మత్తులకు కూడా నోచుకోని రోడ్లకు ఇప్పుడు మహర్దశ పట్టింది. ఎక్కడో మారు మూల గిరిజన తండాలలో సైతం తారు రోడ్లు వెలిసాయి. ఇక ప్రతి పల్లె, పట్టణం సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయి. ఈ రోడ్ల పునర్నిర్మాణం పై ముఖ్యమంత్రి బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక శ్రద్ద పెట్టి అది ఒక మహా యజ్ఞంలా కొనసాగిస్తున్నారు.

5 * ‘పారిశ్రామికాభివృద్ధి’…

పెట్టుబడి, పరిశ్రమ అనే ఈ రెండు పదాలు కూడా గత ఐదేళ్లు ఏపీ ప్రజలకు వినపడని, కనపడని ఒక బ్రహ్మ పదార్థమనే చెప్పాలి. వైసీపీ హయంలో పేపర్లు, ప్రకటనలకే కానీ ప్రజా జీవితానికి సంబంధం లేని పారిశ్రామికాభివృద్ధిని చూసిన ఏపీ ఇప్పుడు NTPC గ్రీన్ ఎనర్జీ, BPCL , గూగుల్, రిలయన్స్ బయో ఎనర్జీ వంటి పరిశ్రమల రాకతో కంటికి కనిపించే అభివృద్ధిని, వాటి ఫలాలను చూడబోతున్నారు. ఇక ఈ పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఎయిర్ ఫోర్ట్ ల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

6 * అందరికి ‘స్వేచ్ఛ’….

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా తప్పుని తప్పుగా చెప్పడానికి, ప్రభుత్వం పై విశ్లేషణాత్మకమైన విమర్శలు చేయడానికి అటు మీడియాకు ఇటు రాజకీయ విశ్లేషకులకు, సామాన్యుడికి కూడా పూర్తి స్వేచ్ఛ దొరికింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో తమ కష్టానికి తగిన ఫలితం పొందడానికి కూడా ప్రభుత్వ పెద్దల ముందు చేతులు జోడించాల్సిన పరిస్థితి, కానీ ఇప్పుడా పరిస్థితి సామాన్యుడి కే కాదు సెలబ్రెటీలకు కూడా లేదు.

ఇలా ఈ ఆరు మార్పులతో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేసే ప్రభుత్వమే కానీ వైసీపీ మాదిరి రాష్ట్రాన్ని ముంచే ప్రభుత్వం కాదనేది స్పష్టమవుతుంది. ఈ సూపర్ సిక్స్ లో కొన్ని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేవిలా ఉంటే, మరికొన్ని సమాజ శ్రేయస్సుకి తోడ్పడేవిగా పని చేస్తున్నాయి, ఇంకొన్ని రాష్ట్ర అభివృద్ధికి నాందిగా మారుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sukumar’s Ram Charan RC17 Film: Anirudh Replaces DSP?

Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…

22 minutes ago

సినిమా వాళ్ళకు మూడు పాఠాలు.. అవసరమే!

బిర్యానీ వండటం అందరికీ రాదు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు అందరూ ఆడలేరు. కానీ వాటిని ఆస్వాదించగలరు. వాటి మంచి చెడ్డలు…

35 minutes ago