రజినీకాంత్ నుండి ఆ యువ హీరోకి పిలుపు వచ్చిన మాట వాస్తవమేనా?

Gopichand got the chance to work with Rajinikanthహీరో నుండి విలన్ గా…. ఆ తరువాత మళ్ళీ హీరోగా ఇలా గోపీచంద్ తెలుగు తెర మీద చెయ్యని ప్రయత్నమే లేదు. అయితే అడపాదడపా వచ్చిన హిట్లు తప్ప ఆయన కేరీర్ పెద్దగా ముందుకు ముందుకు సాగలేదు. ఈ తరుణంలో ఆయనకు సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రంలో ఒక కీలక పాత్ర చేసే అవకాశం వచ్చిందని వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

అయితే వాటిలో నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. “రజినీకాంత్ సినిమా చేస్తున్నావంటగా అని కొందరు అడుగుతున్నారు. నిజం కాదని చెప్పా. ఆ సినిమా దర్శకుడు శివ గతంలో నాతో రెండు సినిమాలు చేశాడు. మేము అప్పుడప్పుడూ మాట్లాడుకుంటాం. మీరు ఎప్పుడు అంటే అప్పుడు సినిమా చేద్దాం అంటాడు. పెద్ద హీరోలతో చేస్తున్నావ్ నీకు అదే మంచిది అంటా,” అని గోపి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఈ హీరో ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో సీటీమార్ లో నటిస్తున్నాడు. ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ కంప్లీట్ కాగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా, తెలంగాణ టీం కు కబడ్డీ కోచ్ గా కనిపించనుండగా ఆంధ్రా కబడ్డీ టీం కు కోచ్ గా గోపిచంద్ నటిస్తున్నాడు.

యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రం విడుదల మీద క్లారిటీ లేదు. సంపత్ నందితో గోపిచంద్ కు ఇది రెండో సినిమా. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద నిరాశపరిచింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గోపి ఆరాటపడుతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories