Telugu

భానిసత్వానికి తప్పదు భారీ మూల్యం..!

ఐదేళ్ల కాలపరిమితి ఉండే రాజకీయ నాయకుల పదవుల అండ చూసుకుని వారు చెప్పిందల్లా జై హుజూర్ అంటూ చేసుకుంటూ పొతే ఆ తరువాత ఎదురయ్యే పరిణామాలకు పూర్తి బాధ్యత వారే అనుభవించవలసి వస్తుంది.

ADVERTISEMENT

ప్రభుత్వాలకు భానిసత్వం చేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చివరికి ఆ ప్రభుత్వాల చేతికి చిక్కడం, శిక్షలు అనుభవించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైస్సార్ ప్రభుత్వ హయం నుండి కొనసాగుతూ వస్తుంది. ఈ విషయంలో జగన్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారనే చెప్పాలి.

2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని వైస్ జగన్ వ్యవస్థలలో ఉన్న అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగుల అండతో తనకు అనుకూలంగా మార్చుకున్నారు.

దానికి ఫలితంగా వైస్సార్ మరణానంతరం వైస్ జగన్ తో సహా ఆయనకు సహకరించిన ప్రతి ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులంతా జగన్ తో పాటుగా అక్రమాస్తుల కేసులో జైళ్లకు వెళ్లి శిక్షలు అనుభవించారు. అందులో ఐఏఎస్ శ్రీ లక్ష్మి ప్రముఖంగా వార్తలలో నిలిచారు.

ఉన్నత చదువులు చదువుకుని, పోటీ రంగంలో నిలదొక్కుకుని, తనను తాను నిరూపించుకుని ఎంతో కష్టపడి సంపాధించుకున్న అవకాశాన్ని ఇలా వ్యక్తి పూజ కోసం వినియోగిస్తే వ్యవస్థలు నిరుపయోగంగా మారిపోతాయి. ప్రజా సేవ కోసం ఉపయోగించాల్సిన అధికారాన్ని ప్రజా సేవకుల కోసం వినియోగిస్తే వారు చట్టపరంగా శిక్షార్హులే.

జగన్ ను నమ్మి చట్ట వ్యతిరేక పనులు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో సాక్ష్యాత్తు కళ్ళ ముందు చూసిన, స్వయంగా అనుభవించిన ఉద్యోగులు సైతం 2019 నుండి 2024 వరకు ఒక వ్యక్తికీ భానిసై తమ అధికారాన్ని అన్యాయం వైపు నిలిపి వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేసారు.

ప్రజాస్వామ్యాన్ని వంచన చేసి, చట్టాన్ని అతిక్రమించి ఒకరకంగా జగన్ కు బానిసలుగా మారి కొంతమంది అధికారులు చేసిన అన్యాయాలకు ఇప్పుడు న్యాయం కావాలి అంటూ బాధితులంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. చంద్రబాబు మొదలు అచ్చమ్ నాయుడు, అయ్యన పాత్రుడు, పట్టాభి, దూళిపాళ్ళ, రఘురామరాజు వంటి నేతలందరు జగన్ ప్రభుత్వ బాధితులే.

గత ప్రభుత్వంలో సాక్ష్యాత్తు ప్రతిపక్ష నేత బాబు ఇంటి మీదకే దాడికి యత్నించిన వారు, టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడిన వారు, అక్రమంగా బలవంతపు అరెస్టులు చేసిన వారు, అరెస్టుల పేరుతో శారీరకంగా, మానసికంగా హింసించిన వారు, అందుకు తెర వెనుక తెర ముందు సహకరించిన వారందరి మీద చర్యలు తీసుకోవాలంటూ బాధితులందరు కేసులు నమోదుచేస్తున్నారు.

ఇందులో RRR నమోదు చేసిన ఫిర్యాదులో మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా ఏపీ సిఐడి, మాజీ డీజీ సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి సీతా రామాంజనేయులు, అప్పట్లో సిఐడి అదనపు ఎస్పీ గా పనిచేసిన ఆర్. విజయపాల్, గుంటూరు జీజీహెచ్ సూపరిండెంట్గా పనిచేసిన డా. ప్రభావతి పేర్లను కూడా జత చేసారు. దీనితో జగన్ ను నమ్మి గీత దాటితే ఊసలు లెక్కపెట్టడం ఖాయమని మరోసారి రుజువు కాబోతుంది. .

అలాగే మద్యం టెండర్ల గోల్ మాల్ విషయంలో వాసుదేవరెడ్డి, ఏపీ అడ్వాకాటే జనరల్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి కూడా తమతమ అధికారాలను వ్యవస్థల బలోపేతానికి కాకుండా జగన్ వ్యక్తిగత స్వార్దానికి వినియోగించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేసులు ఎదుర్కుంటున్నారు.

జగన్ చెప్పాడు…మేము చేసి తీరుతాం అంటూ గత ఐదేళ్లుగా ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులంతా తమ అధికారాన్ని జగన్ కాళ్ళ ముందు నిలిపి వైసీపీ ప్రభుత్వానికి భానిసత్వం చేసారు. ఇపుడు దానికి భారీ మూల్యం చెల్లించబోతున్నారు. జగన్ ఎవ్వరిని అరెస్టు చెయ్యమని ఆదేశిస్తే ఆధారాలతో, సాక్ష్యాలతో సంబంధం లేకుండా వారిని అరెస్టులు చేసి జగన్ మెప్పు పొందడం వారి ఉద్యోగంలో భాగమైపోయింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Not Only Rajini, But He Also Can Deliver 500 Cr?

Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…

19 minutes ago

స్థానికంలో మచ్చుకి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు…

స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…

40 minutes ago