Telugu

మంత్రినని గుర్తులేదు పాపం! అందుకే పరిశ్రమలకు బదులు కేసుల కబుర్లు

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందున, ఈ కేసు తదుపరి విచారణ విస్తృత ధర్మాసనానికి పంపబోతోంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదు కానీ అప్పుడే ఆత్మసాక్షి, వైసీపి నేతలు ఈ కేసులో చంద్రబాబు నాయుడు దోషి అని ఆయన జైలుకి వెళ్ళక తప్పదని తీర్పు చెప్పేశారు.

వారిలో జగన్మోహన్‌ రెడ్డి టికెట్‌ ఇవ్వనని చెప్పి పక్కన పెట్టేసిన మంత్రి గుడివాడ అమర్నాధ్ కూడా ఉన్నారు. జగన్మోహన్‌ రెడ్డిని ప్రసన్నం చేసుకుని టికెట్‌ సాధించుకొనేందుకు చివరి ప్రయత్నంగా ఇవాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు బెయిల్‌పై తిరుగుతున్న దొంగ. సుప్రీంకోర్టులో ఆయనకు ఎటువంటి ఊరట లభించలేదు. కానీ ఎల్లో మీడియా ఊరట లభించిందని ప్రచారం మొదలుపెట్టేసింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ కాకపోయినా రేపు ప్రజాకోర్టులో ఆయనకు శిక్ష తప్పదు,” అని అన్నారు.

ADVERTISEMENT

ఎదుటవారిని ఒక వేలితో చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మనవైపే చూపిస్తుంటాయని గుడ్డు మంత్రి మరిచిన్నట్లున్నారు. అక్రమాస్తుల కేసులలో 16 నెలలు చంచల్‌గూడా జైలులో గడిపి గత 10 ఏళ్లుగా బెయిల్‌పై బయట ఉన్నవారు ఎవరు?తమ అధినేత, వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డిలే అని మరిచిన్నట్లున్నారు.

వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు భౌతికంగా అరెస్ట్ చేయలేదు కానీ పేపర్ల మీద ఆయనను అరెస్ట్ చేసిన్నట్లు చూపి విడిచిపెట్టిన సంగతి మన వెరీ గుడ్డు మంత్రి మరిచిపోయిన్నట్లున్నారు.

తెలంగాణకు కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి, ఆ రాష్ట్ర పరిశ్రమలు, ఐ‌టి శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బృందం పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకు వెళితే, మన గుడ్డు మంత్రి గడప దాటకుండానే లక్షల కోట్లు పెట్టుబడులు సాధించగల సమర్దులు. కనుకనే దావోస్ వెళ్ళడం మానుకున్నారేమో?

గత ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన సదస్సు ద్వారా రాష్ట్రానికి 13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో అనేక పరిశ్రమలు, వాటిలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని మన వెరీ గుడ్డు మంత్రే స్వయంగా చెప్పారు. కానీ తాను పరిశ్రమలు, ఐ‌టి శాఖల మంత్రినని పాపం మరిచిపోయిన్నట్లున్నారు.

బహుశః అందుకే వాటి గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు కేసుల గురించి మాట్లాడుతున్నట్లున్నారు. అయినా వచ్చే ఎన్నికలలో జగన్‌ టికెట్‌ ఇవ్వనని చెప్పేశాక ఇంకా ఆశపడితే ఎలా గుడ్డూజీ?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బొద్దింకలు మాకు థాంక్స్ చెప్పాయి.. అందరూ విన్నారా?

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు…

18 minutes ago

Career Setbacks, Social Media Trolls: Cricketer Breaks Silence

Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…

28 minutes ago