Telugu

ఏపీకి పెట్టుబడులు… ఆ క్రెడిట్ మాదే!

ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు, విశాఖలో శుక్రవారం నుంచి ప్రారంభమైన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ఇంకా పూర్తికానేలేదు… దానిలో వచ్చిన్నట్లు చెప్పుకొంటున్న రూ.13 లక్షల కోట్ల ఎంవోయులపై ఇంకు తడి ఇంకా ఆరనేలేదు. కానీ అప్పుడే వైసీపీ, బిజెపిలు ఈ క్రెడిట్ మాదంటేమాదని గొప్పగా చెప్పుకొంటున్నాయి.

ADVERTISEMENT

సిఎం జగన్మోహన్ రెడ్డి ఇమేజ్‌ని చూసే ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఈరోజు మరోసారి ఉద్ఘాటించారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ నిబద్దత. రాష్ట్రాలకు కేంద్రం అందిస్తున్న సహాయసహాకారాల వలననే ఏపీకి ఇంత భారీగా పెట్టుబడులు వచ్చాయని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు చెప్పుకొన్నారు.

“విశాఖలో పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం మరియు ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. @narendramodiగారి నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కలిగి ఉంది. విశాఖ వేదికగా చేసిన వాగ్దానాలు రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తాయని ఆశిస్తున్నాము. సమావేశానికి నితిన్ గడ్కరీ హాజరు కావడం వల్ల రాష్ట్రాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తుందో చూపిస్తుంది,” అని ట్వీట్‌ చేశారు.

ఈ క్రెడిట్ కోసం వైసీపీ, బిజెపి రెండూ కీచులాడుకోవడం సహజమే. కానీ ఏ కారణంచేతైనా ఈ ఎంయూలతో ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోతే, అప్పుడు ఇందుకు మీరే బాధ్యులంటే కాదు మీరే బాధ్యులని బిజెపి, వైసీపీలు తిట్టుకొంటాయని వేరే చెప్పక్కరలేదు. అప్పుడు కూడా… చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి కుట్రలు పన్ని ఏపీలో తాము పరిశ్రమలు ఏర్పాటుచేయకుండా అడ్డుకొంటున్నారని వైసీపీ నేతలు వాదించినా ఆశ్చర్యం లేదు. ఈ క్రెడిట్ కోసం వైసీపీ తాపత్రయపడటంలో అర్దం ఉంది కానీ ఏపీలో గెలవలేని బిజెపి కోసం సోమూ వీర్రాజు ఆరాటపడటం దేనికో అర్దం కాదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

అధ్యక్ష పదవి పరువు తీస్తున్న ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షులుగా చేసిన అబ్రహం లింకన్ వంటివారు ఆ పదవికి ఎంతో వన్నె తెస్తే, డోనాల్డ్ ట్రంప్‌ అధ్యక్ష…

8 minutes ago

Why Are Janasena Fans Blaming PK Despite TDP’s Sacrifices?

The TDP, despite being the ruling party in Andhra Pradesh, has agreed to share a…

24 minutes ago