
Donald Trump’s Russia Oil Deal
అమెరికా మాజీ అధ్యక్షులుగా చేసిన అబ్రహం లింకన్ వంటివారు ఆ పదవికి ఎంతో వన్నె తెస్తే, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి పరువు తీసేస్తున్నారని చెప్పక తప్పదు. ఆయన తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టిపడేస్తుంటే, మరికొన్నిటిని ఆయనే వెనక్కు తీసుకుంటూ నవ్వులపాలవుతున్నారు.
రష్యా చమురు కొనుగోళ్ళపై ఆంక్షలు విధించి ప్రపంచదేశాలపై ఎడాపెడా జరిమానాలు, అదనపు సుంకాలు విధించిన ట్రంప్, ఇప్పుడు స్వయంగా రష్యాతో చమురు కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడమే ఇందుకు తాజా ఉదాహరణ.
ప్రపంచ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, ఆ సొమ్ముని ఉక్రెయిన్పై యుద్ధానికి వినియోగిస్తుందని, దాంతో వేలాది మంది ప్రజలు చనిపోతారని కనుకనే రష్యా చమురు కొనుగోలుపై ఆంక్షలు విధించామని మొదట ట్రంప్ చెప్పుకున్నారు.
కానీ ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టాక చమురు సంక్షోభం ఏర్పడటంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్ళకు తాత్కాలికంగా అనుమతించారు. అంటే అప్పుడు ఆ డబ్బుని ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా వినియోగించదని అనుకున్నారా?
నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగబోతున్నాయి. చమురు సంక్షోభం ప్రభావం అమెరికాపై కూడా పడుతోంది. అయినా ఇలాగే ఎన్నికలకు వెళ్తే ఎదురుదెబ్బ తప్పదు. కనుక ట్రంప్ మళ్ళీ మాట మార్చి రష్యాతో స్వయంగా చమురు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. దేనికంటే.. జాతీయ ప్రయోజనాలు, ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసమేనట!
ఇప్పుడు రష్యా నుంచి దాదాపు ఏడాదిపాటు ఏకంగా లక్షల టన్నుల చమురు అమెరికా కొనుగోలు చేస్తుంటే, ఆ సొమ్ముని ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా ఉపయోగించకుండా ఉంటుందా? ఉపయోగిస్తే ఉక్రెయిన్ ప్రజలు చనిపోకుండా ఉంటారా?నోబుల్ శాంతి బహుమతి ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంపే సమాధానం చెప్పాలి.
అమెరికా కొనుగోలు చేస్తూ ప్రపంచ దేశాలపై ఆంక్షలు కొనసాగిస్తే ఇంకా విమర్శల పాలవుతారు కనుక ఆంక్షలు ఎత్తివేయక తప్పలేదు. అంటే ఈ విషయంలో తన నిర్ణయాలన్నీ తప్పేనని ట్రంప్ స్వయంగా ధృవీకరించుకున్నట్లే కదా?
The TDP, despite being the ruling party in Andhra Pradesh, has agreed to share a…
The Indian selection committee has announced the Test and ODI squads for the upcoming tour…