
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. అందుకు కారణం బూతుల మంత్రిగా ఖ్యాతి గడించిన గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. ఎమ్మెల్యే గా మంత్రిగా కొడాలి నాని చేసిన బూతు రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దిగజార్చాయనే చెప్పాలి.
జగన్ అండ చూసుకుని కొడాలి రెచ్చిపోతుంటే, కొడాలి మద్దతు తో ఆయన అనుచరులు బరితెగిచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో వెలిసిన క్యాసినోలు, బెట్టింగ్ మాఫియాలు, పేకాట క్లబ్ లు గుడివాడను నిత్యం వార్తలలో నిలిపాయి.
ఈ నేపథ్యంలో నేడు కూడా గుడివాడ రెండు కీలక పరిణామాలతో వార్తలలో నిలిచింది. మొదటిది మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గర బంధువైన అర్జున్ రెడ్డి అరెస్ట్ కాగా మరొకటి మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కూనసాని వినోద్ అరెస్టు.
మొదటిది అర్జున్ రెడ్డి అరెస్టు…2024 లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై మార్ఫింగ్ ఫొటోలను రూపొందించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యడం పై అర్జున్ రెడ్డి పై గతంలోనే కేసు నమోదయ్యింది.
ఆ కేసుకి సంబంధించి నేడు అర్జున్ రెడ్డిని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కూనసాని వినోద్ విషయానికొస్తే, ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కడంతో గుడివాడ వన్ టౌన్ పోలీసులు ఆయనను అరెస్టు చేసారు.
ఆ సమయంలో వినోద్ నుంచి 50 వేలు రూ .నగదు, ఒక సెల్ ఫోన్ ను అధికారాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఒక్క రోజే వైసీపీ కి సంబంధినచిన ఇద్దరు కీలక నేతల అనుచరులు గుడివాడ కేంద్రంగా అరెస్టు కావడంతో 2025 ను కూటమి ప్రభుత్వం ఆపరేషన్ గుడివాడ తో ముంచించబోతుందా అన్న చర్చ జరుగుతుంది.
Aadarsha Kutumbam was supposed to hit theatres on October 9, but it was postponed as…
Senior actress Indraja has openly slammed the trend of holding success meets for films that…