
గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన నాయకుడేనని తేలిన వెంటనే, ముందుగా అతనిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఆ తర్వాత వెంటనే సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత వెంటనే స్పందింస్తూ నిందితుడిపై కటిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “తప్పు చేసిన వారికి రాజకీయ అండ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే,” అని పేర్కొన్నారు.
మంత్రి శ్రీ నారా లోకేష్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, పార్టీలో ఉన్నంత మాత్రాన్న తప్పులు చేస్తామంటే కుదరదు. ఇలాంటి తప్పులు చేసేవారిని టీడీపి క్షమించదు. వెనకేసుకు రాదు. చట్ట ప్రకారం చర్యలు తప్పవు,” అని స్పష్టం చేశారు.
హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు. చట్టప్రకారం నిందితుడిపై తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Drishyam: The Conclusion is creating a lot of buzz with a few more days left…
Eshaanya Mmaheshwari is turning up the heat and setting major fashion goals in her latest…