Telugu

ఆమాత్రం దానికి చంద్రబాబును లేఖ రాయమనడం ఎందుకో?

విజయవాడ వచ్చిన గవర్నర్ నరసింహన్ ను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలోని బీజేపీ నాయకుల బృందం కలిసి పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ చేయించాలని వినతి పత్రం సమర్పించారు. ఆ తంతు ముగిసిన మరునాడే అంటే ఈరోజు చంద్రబాబుకు దమ్ముంటే పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు.

ADVERTISEMENT

[m9ad]

ఇప్పటికే జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలలో పసలేదని పరిశీలకులు తేల్చి చెప్పారు. పీడీ అకౌంట్లు ఎక్కువ ఉన్నాయి అంటే అది అవినీతి చేసినట్టు కాదని, మహా అయితే కొంత ఆర్ధిక క్రమశిక్షణ లేనట్టు అని వారు చెప్పుకొచ్చారు. అయినా జీవీఎల్ నరసింహారావు ఏదో విధంగా ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని పలచన చెయ్యాలని చూస్తున్నట్టుగా ఉంది.

నిజంగా వారిదగ్గర సాక్ష్యాలు ఉంటే కేంద్రం ద్వారా సీబీఐ విచారణ చేయించవచ్చు. దానికి చంద్రబాబును లేఖ రాయమనడం ఎందుకో? సాక్ష్యాలు లేకుండా సీబీఐ విచారణ చేయిస్తే కోర్టు మొట్టికాయలు వెయ్యొచ్చు, అదే జరిగితే చంద్రబాబు మీద ప్రజలకు సింపతీ కలుగుతుందని వారి భయమేమో!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

తీరం దాటిన అర్నాబ్….సహాయక చర్యలు మొదలు

అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…

6 minutes ago

చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం ఇది కాదేమో….

చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…

10 minutes ago