
తెలుగు సినిమా తన స్థాయిని పెంచుకుంటూ, పరిధిని విస్తరించుకుంటూ పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ కు చేరే దిశగా ఒక్కో అడుగు వేస్తుంది. ఇది టాలీవుడ్ కు మంచి సంకేతమే. బాహుబలితో మొదలైన ఈ ప్రస్థానం కల్కి తో మరో మెట్టెకింది అంటున్నారు ట్రేడ్ పండితులు.
అయితే ఒకప్పుడు టాలీవుడ్ నుండి కమెర్షియల్ సినిమాలకు సరిసమానంగా ఫీల్ గుడ్ మూవీస్, కామెడీ మూవీస్ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చేవి. అయితే ఇప్పుడా సంస్కృతీ తెలుగు సినిమాలో అంతరించిపోయిందా అన్నట్లుగా అన్ని పక్కా లెక్కలతో కూడిన కమర్షియల్ యాంగిల్ సినిమాలే బాక్స్ ఆఫీస్ ముందట ప్రత్యక్షమవుతున్నాయి.
అయితే ఇప్పుడు కమర్షియల్ సినిమా రూపురేఖలు మారినమాట వాస్తవమే అయినప్పటికీ తాజాగా బాక్స్ ఆఫీస్ ముందు రికార్డులు సృష్టించిన సినిమాల లిస్ట్ ఒక్కసారి పరిశీలిస్తే రాఖీ బాయ్..కేజిఫ్ 1 , 2 , దేవా..సలార్, కమలహాసన్ విక్రమ్, రజనీకాంత్ జైలర్, అల్లు అర్జున్ పుష్ప, వంగా యానిమల్, రవితేజ టైగెర్ నాగేశ్వర రావు, సినిమాలు పూర్తిగా వైలెన్స్ తో నిండిపోయాయి.
ఇక కాంతారా, అక్కడికి సంస్కృతికి అద్దం పట్టే మూవీ కాగా జై హనుమాన్, కల్కి పురాణాల ఆధారంగా ఏర్పడిన కథలే. ఇక రాజమౌళి RRR ఒక ఫిక్షన్ యాక్షన్ జోనర్ గా బాక్స్ ఆఫీస్ రికార్డుల మోత మోగించి ఆస్కార్ చేజిక్కించుకుంది. ఈ అన్ని సినిమాల మధ్యన సీత రామం, హాయ్ నాన్నా వంటి సినిమాలు ఫీల్ గుడ్ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి.
గతంలో నాలుగు సినిమాలు థియేటర్ల ముందు వస్తే కచ్చితంగా ఒకటి ఫీల్ గుడ్ మూవీ ఉండేది. కానీ నేటి కాలంలో ఆ సినిమాలు కొంచెం కొంచెంగా కనుమరుగవుతున్నాయి. వైలెన్స్ కు పెద్ద పీట వేస్తున్న నేటి తరం దర్శకులు ఇటువంటి సినిమాలను నీళ్ళొదిలేస్తున్నారు. ఫ్యామిలీతో సరదాగా సినిమాకి వెళ్లి నవ్వుకుని వచ్చే మూవీస్ ఇప్పుడు కనిపించడం లేదు.
ఎప్పుడో జన్మకొక అమావాస్యలా అప్పుడప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి ఏ జోనర్ మూవీస్. సిద్దు డీజే టిల్లు, శ్రీ విష్ణు సామజవరగమనా లాస్ట్ కామెడీ జోనర్ మూవీస్. ప్రభాస్ నుంచి ఒక డార్లింగ్ మూవీ లాంటి మూవీ ని చూడాలనుకునే వారి సంఖ్య పెద్దదే కానీ అటువంటి సీనియాలు తీయడానికి నేటి దర్శకులు ఎందుకు వెనకాడుతున్నారో. హను రాఘవపూడి తన సినిమాలో ఈ ఫీల్ గుడ్ మూవీస్ కు ప్రాణం పోస్తున్నారు.
ప్రభాస్, హను కాంబోలో రాబోతున్న సినిమా కూడా మరో సీత రామం మాదిరి మూవీ కావాలని కోరుకుంటున్నారు. దసరాతో మెప్పించలేని నాని హాయ్ నాన్న తో ఆకట్టుకున్నారు. హీరోల స్థాయి పెరిగింది కదా అని ఇటువంటి సినిమాలకు పాతరెయ్యడం ఎంతవరకు సమంజసం. కొందరు దర్శకులు రీ మేకుల మీద పెడుతున్న శ్రద్ద ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించడం మీద పెడితే ఇటువంటి సినిమాలను ఆదరించే వారికీ ఆనందాన్నిచ్చినట్టే.
ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, హ్యాపీ డేస్ వంటి సినిమాలతో ఫీల్ గుడ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే శేఖర్ కమ్ముల కూడా కుభేర తో యాక్షన్ బాట పట్టారు. ఇప్పుడు వచ్చినవే కాదు ఇక ముందు రాబోయే సినిమాలు కూడా జూ. ఎన్టీఆర్ దేవర, పవన్ కళ్యాణ్ ఓజి, రామ్ చరణ్ గేమ్ చేంజెర్, బన్నీ పుష్ప 2 , నాని సరిపోదా శనివారం, మహేష్ రాజమౌళి కాంబోలో రాబోతున్న ఇంటర్ నేషనల్ మూవీలలో ఏ ఒక్కటి ఫీల్ గుడ్ మూవీ లేకపోవడం నిజంగా ఫీల్ అయ్యే విషయమే అంటున్నారు ఈ జోనర్ మూవీ లవర్స్.
Water is becoming a major political and economic challenge for southern India. Andhra Pradesh, Telangana,…
Ranabaali, starring Vijay Deverakonda and Rashmika Mandanna, is among the upcoming pan-India releases of the…